హాలీవుడ్‌ మూవీలో మన స్టార్స్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం సౌదీ అరేబియా వెళ్లారట.

Update: 2025-02-18 11:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం సౌదీ అరేబియా వెళ్లారట. ఈ విషయం గురించి జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, ఇండియన్ సినీ స్టార్స్‌ హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఇండియన్‌ హీరోలను హాలీవుడ్ సినిమాలకి కనీసం చిన్న పాత్రల్లో నటులుగా కూడా తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. ఇండియన్ సినిమా అంటే అన్ని చోట్ల ఆదరణ లభిస్తుంది.

ఆ కారణంగానే చాలా మంది ఇండియన్ స్టార్స్‌కి అంతర్జాతీయ స్థాయిలో ఆఫర్లు లభిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్, ఇండియన్ స్టార్స్ కనిపిస్తే ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంగ్లీష్‌ సినిమాల మేకర్ తమ ఆలోచనని ఈ మధ్య కాలంలో మార్చుకున్నట్లు తెలుస్తుంది. అందుకే సల్మాన్ ఖాన్‌, సంజయ్‌ దత్‌లను హాలీవుడ్‌ సినిమాలో నటింపజేసేందుకు గాను రెడీ అయ్యారు. ఇప్పటి వరకు ఆ హాలీవుడ్ మూవీ ఏంటి అనేది అధికారికంగా ప్రకటించినప్పటికీ బాలీవుడ్ వర్గాల నుంచి అనుకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయింది.

సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఇద్దరూ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గాను సౌదీ అరేబియా వెళ్లారు. ఇటీవల సౌదీ అరేబియాలో ప్రారంభించిన స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఫిబ్రవరి 19 వరకు వీరిద్దరూ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం అందుతుంది. బాలీవుడ్ మీడియాలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఇంగ్లీష్ మూవీలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి... కానీ ఆ మూవీ ఏంటి, ఎప్పుడు షూటింగ్ జరగనుంది, ఎప్పుడు విడుదల కానుంది.. ఇంతకు ఆ సినిమా టైటిల్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

గతంలో పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇండియన్ స్టార్స్ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయారు. ప్రియాంక చోప్రా తప్ప హీరోయిన్స్‌, హీరోలకు హాలీవుడ్‌లో కంటిన్యూ ఆపర్లు రాలేదు. సౌత్‌ హీరోలు సైతం హాలీవుడ్‌లో నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరూ హాలీవుడ్‌లో ఫుల్‌ టైమ్‌ స్టార్స్‌గా ఎదగలేక పోయారు. ఈ సినిమాలతో అయినా వీరిద్దరూ హాలీవుడ్లో గుర్తింపు దక్కించుకుని ముందు ముందు మరిన్ని ఇంగ్లీష్ మూవీల్లో నటిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News