సలీం-జావేద్ కాపీ రైటర్లు.. రచయితలు కాదు

ఇటీవల టీవీ షో ఎఫ్ఐఆర్ రాసిన అమిత్ ఆర్యన్... వారి ఇమేజ్ కి భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2024-10-06 21:30 GMT

70వ దశకం ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల‌ను చూసింది. బాలీవుడ్ కి మ‌ర‌పురాని విజ‌యాల‌తో అద్భుత‌మైన డికేడ్ ఇది. అయితే నాటి క్లాసిక్ చిత్రాల‌కు కథలను రూపొందించినందుకు సలీం-జావేద్ అనే రచయితల‌ ద్వయం ఎంత‌గా పేరు తెచ్చుకున్నారో తెలిసిన‌దే. ఇటీవల టీవీ షో ఎఫ్ఐఆర్ రాసిన అమిత్ ఆర్యన్... వారి ఇమేజ్ కి భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేసారు. ఈ కామెంట్ల‌లో ముఖ్యంగా.. సలీం ఖాన్, జావేద్ అక్తర్‌లు 'కాపీ-రైటర్స్' అని..వారు ఇతర రచయితల నుండి ప్ర‌తిదీ దొంగిలించారని.. ఒరిజిన‌ల్ క‌థ‌ల‌ను ఎప్పుడూ రాయ‌ల‌ద‌ని విమ‌ర్శించారు.

అమిత్ ఆర్యన్ బుల్లితెర షోలు, సినిమాల‌కు రాయ‌డంలో సుప్ర‌సిద్ధుడు. అత‌డు `యే ఉన్ దినోన్ కీ బాత్ హై, లపతగన్` వంటి షోలు రాయడంలో పాపుల‌ర‌య్యారు. అతడు ఇటీవల డిజిటల్ కామెంటరీ ఇంటర్వ్యూ లో బాలీవుడ్ నుండి అత్యంత ప్రసిద్ధ స్క్రీన్ రైటర్లలో ఒకరైన సలీం-జావేద్ గురించి తన అభిప్రాయాలను షేర్ చేసారు. ఇవి అత్యంత వివాదాస్ప‌ద‌మైన వ్యాఖ్య‌లు. అత‌డు ఏమ‌న్నారంటే...?

నేను సలీం- జావేద్‌లను రచయితలుగా పరిగణించను. ప్రపంచం మొత్తం సెల్యూట్ చేసే ఇద్దరు వ్యక్తులు .. కానీ వారు తమ జీవితాంతం దోపిడీ చేశారు. సలీం - జావేద్‌లు కాపీ రైటర్లు.. రచయితలు కాదు! అని వ్యాఖ్యానించారు. 1975లో రమేష్ సిప్పీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ `షోలే` కథ గురించి విశ‌ద‌ప‌రిచారు. ఈ క‌థ‌ను 1971లో వ‌చ్చిన‌ రాజ్ ఖోస్లా చిత్రం `మేరా గావ్ మేరా దేశ్` నుండి కాపీ చేసారని వ్యాఖ్యానించారు. షోలేలో ఒక వ్యక్తి చేతులు నరికివేస్తారు.. అతడి కుటుంబాన్ని ఒక డకాయిట్ నాశ‌నం చేస్తే.. ఇతర వ్యక్తుల ద్వారా తన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. మేరా గావ్ మేరా దేశ్‌లో వినోద్ ఖన్నా `జబ్బర్ సింగ్` అనే డకాయిట్‌గా నటించాడు. షోలే చిత్రంలో నటుడు జయంత్ రిటైర్డ్ సైనికుడిగా నటించాడు. అతడి చేయి ఒక‌టి నరికివేసి ఉంటుంది. అయితే కథకు అమితాబ్ బచ్చన్ పాత్రను జ‌త చేసారు. ఒరిజిన‌ల్ లో రెండు చేతులు న‌రికేసి ఉంటుంది ఆ సీన్.

ఆర్యన్ సినిమాల కథల్లోని సారూప్యతలను పేర్కొన్నాడు. షోలేలోని ప్రతి సన్నివేశం ఇతర చిత్రాల నుండి కాపీ చేసిన‌వేన‌ని పేర్కొన్నాడు. 1975లో యష్ చోప్రా తీసిన దీవార్ చిత్రం గుంగా జుమ్నా నుండి కాపీ చేసిన‌దని కూడా అతడు వాదించాడు. ఎఫ్‌ఐఆర్‌లో గుంగా జుమ్నా, దీవార్, శక్తి వంటి చిత్రాలను ప్రస్తావిస్తూ రచయిత‌ల‌ ద్వయం- సలీం-జావేద్ తమ పని నుండి కూడా కాపీ చేశారని ఆరోపించారు. ప్రతి ఫ్రేమ్ లో యాక్షన్ సీక్వెన్స్ ఎలా దొంగిలించారో అత‌డు వివ‌రించాడు. అయినప్పటికీ ప్రపంచం వాటిని పట్టించుకోదు. అమిత్ మాట్లాడుతూ సలీం - జావేద్ మంచి వ్యాపారవేత్తలు.. సేల్స్‌మెన్... వారికి ఏదైనా అమ్మడం దానిని బాగా వివరించడం తెలుసున‌ని అన్నారు.

తన సంచలనాత్మక వాదనలు వినిపిస్తూనే... తాను రాసిన TV షో FIRకి సలీం ఖాన్ ఎంత పెద్ద అభిమాని అనేది ఆర్య‌న్ గుర్తు చేసుకున్నాడు. స‌లీం తన కుటుంబంతో కలిసేలా ఎఫ్ ఐఆర్ టీమ్‌ను భోజనానికి కూడా ఆహ్వానించాడు. కొన్ని నెలల క్రితం.. సలీం జావేద్‌పై డాక్యుమెంటరీ `యాంగ్రీ యంగ్ మెన్` విడుదలైంది.

Tags:    

Similar News