ర‌ష్మిక‌తో రొమాన్స్ యూర‌ప్ లోనా ?

స‌ల్మాన్ ఖాన్, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా ముర‌గ‌దాస్ `సికంద‌ర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-11 16:30 GMT

స‌ల్మాన్ ఖాన్, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా ముర‌గ‌దాస్ `సికంద‌ర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న సినిమా ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. స‌ల్మాన్ స‌హా కీల‌క న‌టీన‌టుల‌పై ముంబైలో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల స‌హా టాకీ పార్ట్ షూట్ చేసారు. హైద‌రాబాద్ ఆర్ ఎఫ్ సీలోనూ కొంత భాగం షూటింగ్ జరిగింది. ఈనేప‌థ్యంలో త‌దుప‌రి షెడ్యూలో యూరప్ లో ప్లాన్ చేస్తున్నారు.

దీనిలో భాగంగా కొంత టాకీ పార్ట్ తో పాటు రెండు పాట‌ల షూటింగ్ కూడా ప్లాన్ చేసారు. అందులో ఒక‌టి రొమాంటిక్ సాంగ్ అని తెలిసింది. స‌ల్మాన్ -ర‌ష్మిక ల మ‌ధ్య ఇది ఘాటైన రొమాంటిక్ సాంగ్ అని అంటున్నారు. కంపోజ‌ర్ ప్రీత‌మ్ అద్భుత‌మైన రొమాంటిక్ సాంగ్ ని కంపోజ్ చేసి పెట్టారుట‌. ఆ పాట యూర‌ప్ అందాల్లో చిత్రీక‌రిస్తే సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని భావిస్తున్నారుట‌.

మ‌రో పాట మాత్రం ప‌బ్ లో సాగే సాంగ్ అని స‌మాచారం. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్, నిర్మాత సాజిద్ న‌డియావాలా యూర‌ప్ చేరుకున్నారు. ఓ పాట‌కి సంబంధించి లొకేష‌న్లు వెతుతున్నారుట‌. లొకేష‌న్ ఒకే అయిన త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్, ర‌ష్మిక ముంబై నుంచి యూర‌ప్ వెళ్తార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. ఈ సంద‌ర్భంగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఇందులో స‌ల్మాన్ ఖాన్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నా డుట‌.

ఓ రోల్ సాహ‌సోపేతంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. స‌ల్మాన్ ఇటీవ‌ల ప‌క్క‌టెముక‌ల గాయంతో ఇబ్బంది ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయినా అదేపెయిన్ తో ముంబైలో జ‌రిగిన గ‌ణేష్ ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఈద్ 2025 సందర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News