స్టార్ హీరో ఆదాయం ఏడాదికి ఎన్నికోట్లో తెలుసా?

తాజాగా బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఆదాయం ఏటా 220 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి.

Update: 2023-11-20 14:30 GMT

స్టార్ హీరోల ఆదాయ వ‌న‌రుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్ల రూపాయ‌ల సంపాద‌న‌ని వివిధ రూపాల్లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. వాటి ద్వారా ఏటా కోట్ల రూపాయ‌లు ఆదాయం ఖాతాలో జ‌మ అవుతుం టుంది. సినిమా పారితోషికం..బ్రాండింగ్స్ ద్వారా వ‌చ్చే అదాయంతోనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని సృష్టించిన హీరోలెంతో మంది. తాజాగా బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఆదాయం ఏటా 220 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి.


ముఖ్యంగా తొమ్మిది ఆదాయ మార్గాల ద్వారా ఖాన్ భాయ్ ఖాతాలో కోట్లు జ‌మ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. హీరో...నిర్మాణ సంస్థల్ని మిన‌హాయిస్తే స‌ల్మాన్ స్టార్ట‌ప్ ల్లోనూ భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. యాత్ర‌.కామ్ లో ఐదు శాతం వాటా ఉందిట‌. ఆన్ మోబైల్ గ్లోబ‌ల్ లిమిటెడ్ కంపెనీ కిచెందిన వీడియో ప్లాట్ ఫాం చింగారీలోనూ ఇన్వెస్ట్ మెంట్ ఉంది. దానికి ఆయ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్. అలాగే 2012 నుంచి బీయింగ్ క్లాతింగ్ కంపెనీ ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు.

యూర‌ప్..మిడిల్ ఈస్ట్ దేశాల్లో కార్య‌క‌లాపాలు సాగుతున్నాయి. దాదాపు 100 స్టోర్లు క‌లిగి ఉన్న‌ట్లు స‌మాచారం. దీని పేరిట వ‌చ్చే ఆదాయంలో కొంత స‌మాజ సేవ‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. అలాగే ముంబై.. నోయిడా.. ఇండోర్..క‌ల‌క‌త్తా.. బెంగుళూరు లాంటి సిటీల్లో జిమ్ములు నిర్వ‌హిస్తున్నారు. శాంటాక్రూజ్ లో ఉన్న నాలుగు అంత‌స్థుల భ‌వ‌నం నుంచి భారీగానే రెంట్ వ‌స్తుంది.

దీని ధ‌ర 100 కోట్ల‌కు పైగానే ఉంది. ప్ర‌ఖ్యాత బ్రాండింగ్స్ ని ఎండార్స్ చేస్తూ ఏటా కోట్ల సంపాద‌న చేకూరు తుంది. స్పెష‌ల్ ఆర్స్ట్.. మ్యూజిక్ వీడియోస్....నాన్ ఫంగిబుల్ టోకెన్ల‌లోనూ పెట్టుబ‌డులు పెట్టారు. వీట‌న్నింటి ద్వారా స‌ల్మాన్ వార్షిక ఆదాయం 200 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని తేలింది. అయితే నిర్మాణ రంగంలో మాత్రం స‌ల్మాన్ ఆశించిన లాభాలు రావ‌డం లేదు. ఆయ‌న నిర్మిస్తోన్న సినిమాల ఫ‌లితాలు అటు ఇటు అవ్వ‌డంతో నిర్మాణ సంస్థ ద్వారా పెద్ద‌గా ఆదాయం క‌నిపించ‌డంలేదని వినిపిస్తోంది.

Tags:    

Similar News