మరణానికి వీసా అవసరం లేదు.. ఆహ్వానం లేకుండా వస్తుంది!

కృష్ణ జింక‌ల వేట కేసులో స‌ల్మాన్ కి శ‌త్రువుగా మారిన గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ నుంచి అనేక‌మార్లు హ‌త్యా బెదిరింపులు ఎదురైన సంగ‌తి తెలిసిందే.

Update: 2023-11-27 03:46 GMT

కృష్ణ జింక‌ల వేట కేసులో స‌ల్మాన్ కి శ‌త్రువుగా మారిన గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ నుంచి అనేక‌మార్లు హ‌త్యా బెదిరింపులు ఎదురైన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ ప‌లుమార్లు లారెన్స్ బిష్ణోయ్ బృందం బెదిరింపుల‌కు పాల్ప‌డింది. దీనిపై ముంబై పోలీస్ చాలా సీరియ‌స్ గా ఉన్నారు. కానీ ఈ బెదిరింపులు ఇంకా ఆగ‌డం లేదు. ఇప్పుడు మ‌రోసారి స‌ల్మాన్ భాయ్ కి సీరియ‌స్ గా హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే...

కెనడా వాంకోవర్‌లోని వైట్ రాక్ ప్రాంతంలో శనివారం పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ నివాసం వెలుపల తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ నేరపూరిత చర్యకు బాధ్యత వహించాడు. తుపాకీ కాల్పులను నిర్వహించడంలో తన పాత్రను వెల్లడిస్తూ బిష్ణోయ్ ఫేస్ బుక్ లో సందేశాన్ని పోస్ట్ చేసాడు.

ఫేస్‌బుక్‌లో నేరుగా గ్రేవాల్‌ను ఉద్దేశించి, బిష్ణోయ్ ఇలా రాసాడు. ``మీరు సల్మాన్ ఖాన్‌ను సోదరుడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు మీ సోదరుడు వచ్చి మిమ్మల్ని రక్షించే సమయం వచ్చింది. ఈ సందేశం కూడా సల్మాన్ ఖాన్ కోసమే - దావూద్ మిమ్మల్ని రక్షిస్తాడనే భ్రమలో ఉండకండి. నిన్ను ఎవరూ రక్షించలేరు. సిద్ధూ మూస్ వాలా మరణంపై మీ నాటకీయ స్పందన గుర్తించబడలేదు. అతడు ఎలాంటి వ్యక్తి.. అతడికి ఉన్న నేర సంఘాలు ఎలాంటివో మనందరికీ తెలుసు. విక్కీ మిద్దుఖేడాలో ఉన్నప్పుడు మీరు అతని చుట్టూ తిరిగారు. తర్వాత మీరు సిద్ధూ కోసం మరింతగా రోదించారు. మీరు ఇప్పుడు మా రాడార్‌పైకి వచ్చారు. దీనిని ట్రైలర్‌గా పరిగణించండి. పూర్తి సినిమా త్వరలో విడుదల కానుంది. మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి. కానీ గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు. ఇది ఆహ్వానం లేకుండా వస్తుంది`` అని రాసాడు.

ఈ సంఘటన పంజాబీ సంగీత పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గిప్పీ గ్రెవాల్, అతడి కుటుంబ భద్రత కోసం ఆందోళనలు లేవనెత్తారు. లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన స్పష్టమైన బెదిరింపులు పరిస్థితిని తీవ్రతరం చేశాయి. దాడి వెనుక ఉన్న ఉద్దేశాల గురించి చాలా మంది ఆందోళ‌న‌గా ఉన్నారు. అయితే ఈ విషయంపై గిప్పీ గ్రేవాల్ ఇంకా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్ బెదిరించాడు. ఇది తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నాడు. కృష్ణజింకను చంపడం ద్వారా ఖాన్ తన వర్గాన్ని అవమానించాడని ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత అతడు ఇలా బెదిరించాడు. వారి డైటీ ఆలయాన్ని సందర్శించి తన చర్యకు క్షమాపణ కోరాలని అతడు స‌ల్మాన్ ఖాన్‌ని కోరాడు.

Tags:    

Similar News