నెలకు రూ.కోటి...స్టార్ హీరో ప్రాపర్టీ కి డిమాండ్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ముంబయిలోని శాంటాక్రాజ్ లో రిటైల్ కమర్షియల్ స్పేస్ ఉంది. దాన్ని నాలుగు ఏళ్లకు గాను తాజాగా లీజ్ కి ఇచ్చాడు.;
ఒకప్పుడు స్టార్స్ సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే ఆదాయాన్ని కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు స్టార్స్ కి అనేక ఆదాయ మార్గాలు ఉంటున్నాయి. కమర్షియల్ యాడ్స్ మొదలుకుని చాలా రకాలుగా హీరోలు మరియు హీరోయిన్స్ సంపాదించే మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా స్టార్ హీరోలు వారి యొక్క ప్రాపర్టీస్ తో కూడా భారీ ఎత్తున సంపాదన పొందుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ముంబయిలోని శాంటాక్రాజ్ లో రిటైల్ కమర్షియల్ స్పేస్ ఉంది. దాన్ని నాలుగు ఏళ్లకు గాను తాజాగా లీజ్ కి ఇచ్చాడు. నెలకు కోటి రూపాయల చొప్పున డీల్ కుదిరింది.
లాండ్ క్రాప్ట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈ కమర్షియల్ బిల్డింగ్ ను లీజ్ కు తీసుకున్నట్లుగా ప్రాప్‌స్టాక్ సంస్థ వెళ్లడించింది. ఏడాదికి 12 కోట్ల రూపాయల వారిగా చెల్లించబోతున్నారు. ఈ డీల్ లో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.5.4 కోట్ల ను సల్మాన్ పొందినట్లుగా కూడా సమాచారం అందుతోంది.
గతంలో ఈ కమర్షియల్ స్పేస్ ను ఫ్యూచర్ గ్రూప్ కి లీజ్ కి ఇవ్వడం జరిగింది. అప్పుడు నెలకు రూ.80 లక్షల చొప్పున చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఆ మొత్తం భారీగా పెరిగింది. నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షలు పెంచబోతున్నట్లుగా కూడా డీల్ లో ముందుగానే ఒప్పందం జరిగింది.