చిరిగిపోయి అరిగిపోయిన షూస్‌తో భాయ్ ఏంటిలా?
ఆ బూట్లు వేసుకున్నందుకు సల్మాన్‌ను 'హంబుల్ స్టార్' అని కొందరు పిలవగా, మరికొందరు ఇదేంటి భాయ్ ఈ లుక్కేంటి అంటూ జోక్ చేశారు.
సల్మాన్ భాయ్ ప్రస్తుతం 'టైగర్ 3' విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. ప్రస్తుతం కత్రినా కైఫ్‌తో కలిసి తన చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ నుండి సల్మాన్ భాయ్ ఫోటోలు వెబ్ లో ఠారెత్తాయి. అయితే ఇది ఊహించని కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అతడు మురికిపట్టి మాసిపోయి చిరిగిన బూట్లు ధరించి ఉన్న షూస్ ని ధరించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ ఫోటోగ్రాఫ్ లో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్‌తో కలిసి కూర్చుని కెమెరాకు పోజు ఇస్తున్నాడు. అతడు నల్లటి పోలో షర్ట్ కాంబినేషన్ బ్లాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అయితే అరిగిపోయిన నల్లటి లెదర్ షూస్ ని తొడుక్కుని కనిపించాడు. బూట్లలో ఒకదానికి పెద్ద రంధ్రం ఉంది. మరొక షూ తోలు చిరిగిపోయింది. బాగా మురికిపట్టి కనిపించాయి.
సల్మాన్ ఖాన్ చిరిగిన బూట్లను గమనించిన నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో విరుచుకుపడ్డారు. ఆ బూట్లు వేసుకున్నందుకు సల్మాన్‌ను 'హంబుల్ స్టార్' అని కొందరు పిలవగా, మరికొందరు ఇదేంటి భాయ్ ఈ లుక్కేంటి అంటూ జోక్ చేశారు. అందులో ఒక కామెంట్‌లో ''ఇది సింప్లిసిటీ' అని రాసి ఉంది. మరొకరు ఇలా రాసారు. ''ఇది ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది భాయ్'' అని రాయగా, మరొకరు ''అతడు ట్రెండ్‌సెట్టర్' అని రాసారు.
టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద పని చేయకపోవడంతో ఇలా జరిగింది! అని కూడా మరొకరు చమత్కరించారు, జీవితంలో చాలా ధనవంతులైన మీరు చిరిగిన దుస్తులను ధరించినప్పుడు ప్రజలు మిమ్మల్ని పేదవారు అని కాదు.. సాధారణ వ్యక్తులు అని పిలుస్తారు అని రాసారు. అరె భాయ్ వో ఫ్యాషన్ హే సెల్మోన్ భాయ్ కా... వి జూతా బీయింగ్ హ్యూమన్ మి 20,000 కా మిలేగా దేఖ్నా (అదే అతని స్టైల్. అదే షూ బీయింగ్ హ్యూమన్‌లో రూ.20,000కి అమ్ముడవుతుంది) అని కూడా ఛమత్కరించారు.
ఇటీవల సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ సినిమా ప్రదర్శనకు హాజరు కాగా, ఈ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ అవుతోంది. ఇంతకుముందు లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ సాధా సీదాగా ఉండే చెప్పల్స్ తో కనిపించడం ట్రెండ్ అయింది. ఇప్పుడు అలానే సల్మాన్ భాయ్ చినిగిన షూస్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. వైరల్ గా చర్చల్లోకొచ్చాయి.
కత్రినా కైఫ్, గౌరీ ఖాన్, కియారా అద్వానీ, సునీల్ శెట్టి సహా పలువురు ఇతర తారలు బుధవారం ఫారీ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. జమ్తారా-ఫేమ్ దర్శకుడు సౌమేంద్ర పాధి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలీజ్ అగ్నిహోత్రి, జుహీ బబ్బర్, రోనిత్ రాయ్, జైన్ షా, ప్రసన్న బిష్త్ , లవిష్క గుప్తా తదితరులు నటించారు. ఈ సినిమా ఈరోజు (నవంబర్ 24) థియేటర్లలో విడుదలైంది.
మనీష్ శర్మ తెరకెక్కించిన 'టైగర్ 3' చిత్రం ఏక్ థా టైగర్ - టైగర్ జిందా హై తర్వాత టైగర్ ఫ్రాంచైజీలో మూడవ భాగం. YRF గూఢచారి విశ్వంలో ఐదవ చిత్రం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కాకుండా కత్రినా కైఫ్ - ఇమ్రాన్ హష్మీ కూడా నటించారు. ఈ దీపావళికి థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.394.5 కోట్లు వసూలు చేసింది.