ట్రెండీ డ్రెస్ లో సామ్.. వ్వాటే లుక్

ఆమె యాక్ట్ చేసిన చిత్రాలు దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి.

Update: 2024-09-26 09:11 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. 14 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించింది. మరెన్నో ప్రశంసలు అందుకుంది. అన్నిటి కన్నా.. వేరే లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది. ప్రభాస్ మినహా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. ఆమె యాక్ట్ చేసిన చిత్రాలు దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. చివరగా ఖుషి సినిమాతో సందడి చేసింది సామ్.


యశోద మూవీ టైమ్ లో మయోసైటిస్ బారిన పడ్డ సమంత.. ఆ తర్వాత చికిత్స తీసుకుంది. తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసి విదేశాలకు వెళ్ళింది. ట్రీట్మెంట్ తో పాటు రెస్ట్ తీసుకుంది. ఆధ్యాత్మిక పర్యటనల్లో మునిగితేలింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపింది. రీసెంట్ గా ఇండియాకు వచ్చింది. హెల్త్ సెట్ అవ్వడంతో మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధమైంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం పేరుతో మూవీ అనౌన్స్ చేసింది.


అయితే సామ్.. త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా ఆ సిరీస్ ప్రీమియర్ ను లండన్ లో ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి సమంత అటెండ్ అయింది. సింపుల్ ప్లెయిన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మడు.. అక్కడ ఎట్రాక్షన్ గా నిలిచింది.


అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్లెయిన్ ట్రెండీ డ్రెస్ లో సమంత అదిరిపోయింది. కేజ్రీ పొజులతో మైండ్ బ్లాక్ చేసింది. సింపుల్ గా కనిపిస్తూనే ఆకట్టుకుంది. ప్రస్తుతం సామ్ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోస్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏ ఔట్ ఫిట్ అయినా అమ్మడు సూపర్ అని చెబుతున్నారు. లైక్స్ కొడుతూ కామెంట్ సెక్షన్ నింపుతున్నారు.


మరోవైపు, సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సామ్ చాలా కష్టపడింది. అనేక విద్యలు నేర్చుకుంది. షూటింగ్ టైమ్ లో హెల్త్ ఇష్యూ వల్ల పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయాలను స్వయంగా ఆమెనే చెప్పింది. ఇప్పుడు జోరుగా ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ వెబ్ సిరీస్ తో సమంత ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News