సమంత అమ్మతనం.. బుర్రకు పని చెప్పేలా ఉందే..!
ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో సమంత అదరగొట్టేసింది తల్లి పాత్రతో సమంత సర్ ప్రైజ్ చేసింది.
మొన్నటిదాకా సౌత్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించిన సమంత ఇన్నేళ్ల కెరీర్ లో కూడా చేయని సాహసాలు ఆ సీరీస్ లో చేసింది. అందుకే ఆమెకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ అండ్ డీకే లతోనే సమంత సిటాడెల్ హనీ బన్నీ అనే సీరీస్ చేసింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్ర నటించిన పాత్రలో సమంత నటించింది.
సమంతలోని కొత్త యాంగిల్ ని ఈ సీరీస్ బయట పెట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో సమంత అదరగొట్టేసింది. తల్లి పాత్రతో సమంత సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఈ సీరీస్ చేసిన తర్వాత తనకు అమ్మ అవ్వాలని ఉందని చెప్పింది సమంత. తల్లి కావాలనే కలలు తనకు ఉన్నాయని.. అమ్మగా ఉండేందుకు తాను ఇష్టపడతానని చెప్పింది. ఐతే దానికి ఆలస్యమైందని తాను అనుకోవట్లేదని అన్నది. ప్రస్తుతం తాను సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పింది.
సమంత ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆమె మరో పెళ్లికి దాదాపు రెడీ అన్నట్టుగానే చెబుతున్నాయి. ఐతే నిజంగానే సమంత ఉద్దేశం అదేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే అమ్మతనం మీద సమంత పెంచుకున్న ప్రేమ చూస్తుంటే కచ్చితంగా ఆమె కూడా త్వరలోనే ఒక తోడుని వెతుక్కునేలా ఉందనిపిస్తుంది. ఐతే అది మళ్లీ కెరీర్ కు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో సమంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది.
సమంత సినిమాల విషయానికి వస్తే సిల్వర్ స్క్రీన్ పై కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత వెబ్ సీరీస్ లతో అలరిస్తుంది. సిటాడెల్ తర్వాత సమంత రాజ్ అండ్ డీకే లతోనే మరో వెబ్ సీరీస్ లో ఛాన్స్ అందుకుంది. మరోపక్క ఆమె ప్రొడక్షన్ లో మొదటి సినిమాగా మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది. ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
సౌత్ సినిమాల కన్నా సమంత బాలీవుడ్ లోనే తన ఫోకస్ పెడుతుందని అర్థమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో సరైన ఛాన్స్ లు రాకనే సమంత బాలీవుడ్ వైపు వెళ్లింది. ఆమధ్య ఒక సినిమా ఈవెంట్ లో త్రివిక్రం తో కూడా తనకు పాత్రలు రాస్తే ఇక్కడ సినిమాలు చేస్తానని చెప్పింది సమంత. సో ఆమె నటించడానికి సిద్ధంగా ఉన్నా మన మేకర్స్ సమంతకు ఛాన్స్ లు ఇవ్వట్లేదని తెలుస్తుంది.