ఓటీటీ సిరీస్‌ల‌తో అద‌ర‌గొడుతున్న అగ్ర‌నాయిక‌లు

ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

Update: 2024-10-20 04:00 GMT

స‌మంత రూత్ ప్ర‌భు మెయిన్ స్ట్రీమ్ క‌థానాయిక అయినా ఓటీటీ సిరీస్ ల‌తోను గొప్ప పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీమ్యాన్ 2లో రాజీ పాత్ర‌తో మెప్పించిన స‌మంత త‌దుప‌రి సిటాడెల్ -హ‌నీ బ‌న్నీలో యాక్ష‌న్ పాత్ర‌లో న‌టించింది. ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇందులో స‌మంత ప‌ర్ఫెక్ట్ స్టంట్స్ తో అద‌ర‌గొడుతోంది. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న 'ర‌క్త్ బ్ర‌హ్మాండ్' సిరీస్‌లోను స‌మంత న‌టిస్తోంది. టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోనే ఉత్కంఠ మొద‌లైంది. సామ్ ఇందులో ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌నుందో చూడాల‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

స‌మంత కంటే ముందే త‌మ‌న్నా కూడా ఓటీటీ సిరీస్ ల‌లో ఆరంగేట్రం చేసింది. వ‌రుస‌గా ఓటీటీ సిరీస్ ల‌లో న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. సినీరంగంలో రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ ని కొన‌సాగించిన త‌మ‌న్నా ఇప్పుడు ఓ క్రేజీ వెబ్ సినిమాలో న‌టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ సినిమాకి నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అత‌డు తెర‌కెక్కించిన‌ `ఆరోన్ మే కహా దమ్ థా` చిత్రం OTT విడుదలకు సిద్ధంగా ఉంది. త‌దుప‌రి `సికందర్ కా ముఖద్దర్` నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది. ఇందులో లైలా మజ్ను ఫేమ్ అవినాష్ తివారీ, త‌మ‌న్నా ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

కొంత గ్యాప్ త‌ర్వాత ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో ప‌ని చేసే అవకాశాల్ని అందుకుంది త‌మ‌న్నా. ఇటీవ‌ల‌ స్త్రీ 2లో తమన్నా డ్యాన్స్ నంబ‌ర్ యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంది. ఇంత‌లోనే నీర‌జ్ పాండేతో సినిమాలో అవ‌కాశం అందుకోవ‌డం ఈ భామ ల‌క్ అని చెప్ప‌లి. నీర‌జ్- త‌మ‌న్నా కాంబినేష‌న్ సిరీస్ మ‌రో రెండు నెల‌ల్లోనే ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. నీర‌జ్ త‌న సినిమాల్లో యంగేజింగ్ పాత్ర‌ల‌తో మెస్మ‌రైజ్ చేస్తాడు. ఈసారి అవినాష్, త‌మ‌న్నాల‌కు అలాంటి న‌ట‌న‌కు ఆస్కారం క‌ల్పించాడు. త‌మ‌న్నా లాంటి గ్లామ‌ర‌స్ బ్యూటీని తెర‌పై ఎలా చూపిస్తున్నాడో వేచి చూడాల్సి ఉంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్నా కానీ స‌మంత‌, త‌మ‌న్నా ఓటీటీ సిరీస్ ల‌తోను అభిమానుల‌కు మ‌రింత‌గా చేరువ‌వుతుండ‌డం గ‌మ‌నించ‌ద‌గిన ప‌రిణామం.

Tags:    

Similar News