బాలీవుడ్‌లో స‌మంత ఇన్‌సైడ‌రా? ఔట్ సైడ‌రా?

అనన్య పాండే CTRL ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సమంతా తన సోషల్ మీడియాలో అన‌న్య న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించింది.

Update: 2024-10-09 05:30 GMT

అనన్య పాండే CTRL ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సమంతా తన సోషల్ మీడియాలో అన‌న్య న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. ఇది అనన్య, సమంతల అభిమానుల దృష్టిని ఆకర్షించింది. స‌మంత నిరంత‌రం హిందీ మీడియా వార్తల్లో నిలవడం కోసమే ఆమె ఇలా చేస్తోందని కొందరు అభిప్రాయ‌ప‌డ్డారు.

అంతంత మాత్రం న‌ట‌న, గ్లామ‌ర్ డాళ్ అప్పియ‌రెన్స్ తో క‌నిపించే అన‌న్య‌ను స‌మంత అంత ఇదిగా పొగిడేయ‌డం వెన‌క ఏదైనా లాజిక్ ఉందా? అంటూ ఇప్పుడు రంధ్రాన్వేష‌ణ జ‌రుగుతోంది. దీనిని ఒక్కొక్క‌రూ ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. అన‌న్య పాండే బాలీవుడ్ ఇన్ సైడ‌ర్. ఒక పాపుల‌ర్ న‌టుడి(చంకీ పాండే)కి న‌ట‌వార‌సురాలు. అన‌న్యను పొగిడేయ‌డం అంటే, అన‌న్య‌ స్నేహితురాళ్లు అయిన సారా అలీఖాన్, సుహానా ఖాన్, జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ లాంటి న‌ట‌వార‌సురాళ్లంద‌రికీ బాస‌ట ప‌లికిన‌ట్టే. అలాగే షారూఖ్‌, చంకీపాండే, బోనీక‌పూర్, క‌ర‌ణ్ జోహార్ వంటి ప్ర‌ముఖుల దృష్టిలో త‌మ వ్య‌క్తి (ఇన్ సైడ‌ర్) అని క‌ళ్ల‌లో ప‌డటం సులువు.

స‌మంత ఒకే దెబ్బ‌కు ప‌ది పిట్ట‌లు అన్న‌ చందంగా వారంద‌రికీ క‌నెక్ట‌యిపోతోంది. చివ‌రికి ఇది స‌మంత బాలీవుడ్ కెరీర్ కి స‌హ‌క‌రిస్తుందనేది వ్యూహం. అలాగే బాలీవుడ్ లో న‌వ‌త‌రం దూకుడు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వీరంద‌రి నుంచి త‌నకు పోటీ అన్న‌ది లేకుండా ఎలా వ్యూహం ర‌చించాలో కూడా స‌మంత‌కు ఒక ఐడియా ఉంద‌ని కూడా ఊహిస్తున్నారు.

ఫ్యామిలీమ్యాన్ 2 లో రాజీ పాత్ర‌, సిటాడెల్ హ‌నీబ‌న్నీలో సూప‌ర్ గాళ్ పాత్ర‌తో స‌మంత ప్ర‌తిభ‌పై అంచ‌నా పెద్ద స్థాయిలో ఉంది. అందుకే ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది స‌మంత‌. అలాగే ఇన్ సైడ‌ర్స్ , ఔట్ సైడ‌ర్స్ టాపిక్ తో ఔట్ సైడ‌ర్స్ తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ప్ర‌తిభ ఉండి కూడా ఇన్ సైడ్ స‌రైన స‌త్సంబంధాలు లేక‌పోతే ఇబ్బందే. ఇవ‌న్నీ ఆలోచించి సామ్ తెలివిగా త‌న స్నేహాల‌ను కొన‌సాగిస్తోందని విశ్లేషిస్తున్నారు.

మ‌రీ ఇంత‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేక‌పోతే .. సామ్ యాధృచ్ఛికంగానే అన‌న్య పాండే వెబ్ షో చూశాక త‌న‌కు బాగా న‌చ్చేయ‌డం వ‌ల్ల అలా స్పందించి ఉంటుంద‌ని కొద్దిమంది విశ్లేషిస్తున్నారు. మ‌రికొంద‌రు అన‌న్య పాండే ఏ లిస్ట‌ర్స్ లో ఉంది గ‌నుక తాను కూడా అలాంటి వారితోనే స్నేహం చేయాల‌నుకుంటోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఔట్ సైడ‌ర్స్ కి సానుకూలంగా ఉండ‌టం వ‌ల్ల కూడా బాలీవుడ్ లో ఒదిగేదేమీ ఉండ‌దు. అందుకే స‌మంత ఇలా చేస్తోంద‌ని అంద‌రూ ఊహిస్తున్నారు.

Tags:    

Similar News