సామ్ ఈసారి ఎందుకు అలా భ‌య‌ప‌డుతోంది?

వెల్ నెస్ బై అల్కేష్ పేరుతో నిపుణుడైన అల్కేష్ స‌ల‌హాల‌తో రూపొందించిన ఈ వీడియోలో చాలా వాస్త‌వ‌మైన టిప్స్ తో ఆక‌ట్టుకుంది.

Update: 2024-09-03 21:30 GMT

త‌న అభిమానులు ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాల‌ని కోరుకుంటుంది స‌మంత‌. సోష‌ల్ మీడియాల్లో త‌న అభిమానుల‌కు నిరంత‌రం ట‌చ్ లో ఉంటూ వారి ఆరోగ్యం కోసం చ‌క్క‌ని చిట్కాలు అందిస్తున్న స‌మంత ఇప్పుడు మ‌రోసారి అద్భుత‌మైన చిట్కాల‌తో ముందుకు వ‌చ్చారు. వెల్ నెస్ బై అల్కేష్ పేరుతో నిపుణుడైన అల్కేష్ స‌ల‌హాల‌తో రూపొందించిన ఈ వీడియోలో చాలా వాస్త‌వ‌మైన టిప్స్ తో ఆక‌ట్టుకుంది.

మెరుగైన గట్ ఆరోగ్యం కోసం చిట్కాలు డీప్ మ్యాట‌ర్స్ ని వెల్ల‌డిస్తూ వెల్ నెస్ నిపుణుడు అల్కేష్‌- స‌మంత‌ చెబుతున్న విష‌యాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అన‌వ‌స‌ర‌మైన రోస్టెడ్ ఫుడ్స్ ని తిన‌కుండా ఫ్రెష్ గా ఉండే వెజిట‌బుల్స్ తినాల‌ని కూడా సూచించారు. ప్ర‌కృతి సిద్ధంగా లేని అస‌హ‌జ వంట‌కాల‌తోనే ముప్పు అని కూడా తెలిపారు.

అయితే స‌మంత గ‌తానుభ‌వాల దృష్ట్యా ఈసారి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ స‌మ‌స్య‌ను త‌లకెత్తుకోకుండా జాగ్ర‌త్త ప‌డింది. దీనిని డాక్ట‌ర్ స‌ల‌హాగా భావించ‌కండి. ఇది తెలుసుకోవ‌డం ఆచ‌రించ‌డం వ‌ర‌కే. ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఏవి ఉన్నా కానీ వైద్యుల‌ను సంప్ర‌దించాల్సిందిగా స‌మంత సూచించింది.

ఈ ఎపిసోడ్‌లో ఉన్న ఆడియో, టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు, ఇతర మెటీరియల్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ ఎపిసోడ్‌లోని మెటీరియల్ ఏదీ వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.. వైద్య పరిస్థితి లేదా చికిత్సకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కొత్త ఆరోగ్య సంరక్షణ నియమావళిని చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహాను తీసుకోండి! అని కూడా వెల్ల‌డించారు. వృత్తిపరమైన వైద్య సలహాను విస్మరించవద్దు లేదా మీకు స‌మ‌స్య ఉంటే.. దానిని తెలుసుకోవ‌డాన్ని ఆలస్యం చేయవద్దు. ఈ పోడ్‌కాస్ట్‌లో వినండి.. అని కోరారు సమంత‌.

అయితే సామ్ ఇలా కోర‌డానికి కార‌ణం ఇంత‌కుముందు నెబ్యులైజ‌ర్ గురించిన కాంట్ర‌వ‌ర్శీ అన్న సంగ‌తి తెలిసిందే. ఖ‌రీదైన అందుబాటులో లేని వైద్యం కోసం వాత‌లు పెట్టుకోకుండా స‌హ‌జ‌సిద్ధంగా నెబ్యులైజ‌ర్ తో ఆవిరి ప‌ట్టండి అని స‌ల‌హా ఇచ్చింది సామ్. కానీ దీనిపై కొంద‌రు వైద్యులు చాలా సీరియ‌స్ అయ్యారు. స‌మంత ఇలా డాక్ట‌ర్ గా మార‌కూడ‌ద‌ని కూడా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News