చిన్న హీరోతో సమంత ప్రయోగమే..

ఇప్పుడు ఆమె నటించిన ‘సీటాడెల్: హనీ బన్నీ’ మాత్రం స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది.

Update: 2024-10-16 11:12 GMT

టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకుని నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ పరంగా ఎఫెక్ట్‌ను చూపించిన హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ లేడీ సమంత రూత్ ప్రభు ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందంతో పాటు మైమరపించే నటనతో మెప్పించిన ఈ భామ.. స్టార్‌గా మారిన తర్వాత మరింతగా దూసుకెళ్లింది.

సమంత రూత్ ప్రభు చాలా కాలం పాటు ఏకధాటిగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె సెలెక్టెడ్‌గానే స్క్రిప్టులను ఎంపిక చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ బడా హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. చివరిగా సమంత ‘ఖుషి’ వచ్చి మెప్పించింది. ఈ చిత్రం ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే సినిమాలు కూడా నెమ్మదిగా చేస్తోంది. ఇప్పుడు ఆమె నటించిన ‘సీటాడెల్: హనీ బన్నీ’ మాత్రం స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. ఇటీవలే సమంత రూత్ ప్రభు ‘ట్రలాల మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. తద్వారా నిర్మాతగా బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది.

‘ఖుషి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సమంత రూత్ ప్రభు తన సొంత బ్యానర్‌లోనే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. ఇందులో ఆమె లీడ్ రోల్ కూడా చేయబోతున్నట్లు వెల్లడించింది. దీనితో పాటు సమంత ఇప్పుడు మరో చిత్రాన్ని కూడా నటిస్తూ నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.

సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటించబోయే కొత్త సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించబోతున్నాడట. ఇందులో వీళ్లిద్దరూ జంటగా చేసే సందడి ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలిసింది. ఇక, ఈ చిత్రం రొమాంటిక్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని అంటున్నారు. దీంతో ఈ కాంబోపై అప్పుడే అందరిలోనూ అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రియదర్శీ - సమంత రూత్ ప్రభు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడట. దీన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సైతం తెరకెక్కిస్తారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లిద్దరితో పాటు ఈ చిత్రంలో ఎంతో మంది పేరున్న నటీనటులు భాగం కాబోతున్నారని సమాచారం.

Tags:    

Similar News