బ్రాండ్ మ్యాడం! ఇది సమంత బ్రాండ్!
తానో స్వేచ్ఛా జీవి అని నిరూపించిన సందర్భాలెన్నో ఉన్నాయి.
సమంత స్టైలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ వరల్డ్ లో అమ్మడు ఎప్పుడూ ప్రత్యర్ధులకు టప్ కాంపిటీషన్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సామ్ స్టైల్ కా బాప్ అనిపించిన సందర్భాలెన్నో. ట్రెండ్ ని ఫాలో అవుతూ ట్రెండ్ ని సెట్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. అవసరం మేర అన్ని రకాలుగా నేను సైతం అంటూ ముందుకొస్తుంది. తానో స్వేచ్ఛా జీవి అని నిరూపించిన సందర్భాలెన్నో ఉన్నాయి.
అదే స్వేచ్ఛ అమ్మడిపై కొన్ని రకాల నెగివిటికీ దారి తీసింది అనుకోండి. అది వేరే సంగతి . తాజాగా అమ్మడు సారి తనదైన బ్రాండెడ్ దుస్తులు...యాక్సరసీస్ లో తళుక్కుమంది. అమ్మడు మరోసారి ఆకర్షణమీయన దుస్తుల్లో మెరిసింది. వెట్ లక్క గూచీ జాకెట్ స్కర్ట్ లో అదిరిపోయే బ్యూటీని పరిచయం చేసింది. వజ్రాలు పొదిగిన సర్పెంటి స్పిగా వాచ్‌తో తనలో సొగసును మరింత రెట్టింపు చేసింది. చేతి ధరించిన వాచ్ వజ్రాలతో డిజైన్ చేసినట్లు ఎంతో స్టైలిగ్ కనిపిస్తుంది. చూడటానికి వెండి ఒపలిన్ కలిగి ఉంది.
మణికట్టు చుట్టూ మెరిసే డ్రెస్ మ్యాచింగ్ బ్రాస్లెట్ను గమనించొచ్చు. మరి దీని ధర ఎంతో తెలుసా? అక్షరాల 80 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. మొత్తానికి మరోసారి సమంత తనదైన బ్రాండెడ్ యాక్సరీస్ ధరించి నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో దూసుకుపోతుంది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక సమంత కంబ్యాక్ కి సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఖుషీ తర్వాత విదేశాలు చెక్కేసిన అమ్మడు మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతుంది.
కమిట్ అయిన చిత్రాలు పూర్తి చేయనుంది. ముందుగా `సీటాడెల్` వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. `ఫ్యామిలి మ్యాన్ -2` వెబ్ సిరీస్ తర్వాత అమ్మడు నటించిన సిరీస్ ఇది. అలాగే బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సంతకం చేసింది. తాప్సీ బ్యానర్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.