సామ్ జిమ్ లుక్.. మైండ్ బ్లోయింగ్

తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటో పంచుకుంది. ఆ ఫోటో ఆమె జిమ్ లో తీసుకున్న సెల్ఫీ కావడం విశేషం.

Update: 2023-09-19 06:17 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ను స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె పేరు ఒక బ్రాండ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం గడిచినా, ఇంకా ఆఫర్లు అందుకుంటూనే ఉంది. రీసెంట్ గానే ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఆమె రౌడీ హీరో విజయ్ దేవర కొండ సరసన నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతం అంటూ సినిమా చూసినవారు అన్నారు. అయితే, ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కొందరు మూవీ అద్భుతంగా ఉందని, కొనియాడగా, మరి కొందరు మాత్రం నాట్ అప్ టూ మార్క్ అని విమర్శించారు.


సమంత, విజయ్ మాత్రం ఈ మూవీ రిజల్ట్ పట్ల సంతోషంగానే ఉన్నారు. అయితే, ఈ మూవీ విడుదలకు ముందే సమంత అమెరికా వెళ్లిపోయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, చికిత్స కోసం అమెరికా వెళ్లింది. అయితే, అక్కడ చికిత్స మొదలుపెట్టకుండా, మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత ఓ రోజు ఏకంగా హైదరాబాద్ కూడా వచ్చేసింది. మరి చికిత్స సంగతి ఏంటి అని ఫ్యాన్స్ అనుకునేలోపు మళ్లీ న్యూయార్క్ చెక్కేసింది.

ఇక, పూర్తిగా చికిత్స అయిపోయేంత వరకు మళ్లీ ఇండియా వచ్చేది లేదు అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులే స్వయంగా చెప్పేశారు. ఈ ట్రీట్మెంట్ కోసమే, సమంత ఏకంగా సంవత్సరం పాటు మూవీస్ కి గ్యాప్ ఇచ్చింది. అయితే, ఫ్యాన్స్ కి మాత్రం దగ్గరగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటో పంచుకుంది. ఆ ఫోటో ఆమె జిమ్ లో తీసుకున్న సెల్ఫీ కావడం విశేషం. ఆరోగ్యం ఎలా ఉన్నా, సమంత ఫిట్నెస్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గదు. జిమ్ లో కసరత్తులు చేసిన తర్వాత ఎదురుగా ఉన్న మిర్రర్ లో సెల్ఫీ తీసుకుంది. ఆమె ఒంటిపై చెమటలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ఇక, ఆమె జిమ్ వేర్ లో కనిపిస్తున్నారు. చాలా ఫిట్ గా, అందంగా కనపడుతున్నారు. ఇక, ఖుషీ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే, మొదటి వారం కలెక్షన్లు బాగానే రాబట్టింది. మొదటి వారాంతంలో రూ.70కోట్లకు పైగా రాబట్టింది. కానీ , ఆ తర్వాత ఫుల్ గా డ్రాప్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి కూడా రానుంది.

Tags:    

Similar News