సామ్ పెళ్లి గౌను.. ఒక్కొక్కరు ఒక్కోలా..

వారిద్దరు విడాకులు తీసుకుని మూడేళ్లు అయినా ఇప్పటికీ ఆ జంట కోసం చాలా మంది మాట్లాడుకుంటుంటారు.

Update: 2024-04-26 12:00 GMT

హీరోయిన్ సమంత.. ఈ పేరు వినగానే చాలా మందికి ఆమె పెళ్లి, విడాకుల అంశం గుర్తుస్తుంటుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత ఎన్నాళ్లు కూడా వారి బంధం నిలవలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. వారిద్దరు విడాకులు తీసుకుని మూడేళ్లు అయినా ఇప్పటికీ ఆ జంట కోసం చాలా మంది మాట్లాడుకుంటుంటారు.


చైతూ- సామ్ వివాహం 2017లో గోవా వేదికగా హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో జరిగిన విషయం తెలిసిందే. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి వేడుకలో దివంగత రామానాయుడి భార్య చీరను సమంత రీమోడల్‌ చేయించి కట్టుకుంది. క్రిస్టియన్‌ వెడ్డింగ్‌ లో తెల్లని గౌనును స్పెషల్ గా డిజైన్ చేసుకుని వేసుకుంది. అప్పట్లో సామ్ గౌను తెగ వైరల్ అయింది. ఇక ఇన్నాళ్లుగా ఆ పెళ్లి గౌనును భద్రంగా దాచుకుంది సమంత.


అయితే ఈ గౌను విషయంలో తాజాగా సమంత చేసిన పని చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లి గౌనును బయటకు తీసి రీమోడల్ చేయించుకుంది. వైట్ కలర్ పెళ్లి గౌనును బ్లాక్ కలర్ కు మార్చి దానిని వేసుకుని ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది. అయితే సమంత గౌనును రీమోడల్ చేసిన క్రేశ బజాజ్ సంస్థ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. "కొత్త జ్ఞాపకాలు, నడవడానికి కొత్త దారులు, చెప్పడానికి కొత్త కథలు ఎప్పుడూ ఉంటాయి. సమంతతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. ఆమెకు ఒక కొత్త జ్ఞాపకాన్ని సృష్టించాం" అని పోస్ట్ చేసింది.

ఇక సామ్ కూడా "నాకు ఇష్టమైన గౌనును రీ మోడలింగ్ చేయించాను. అలవాట్లు, జీవన శైలి మార్చుకున్నట్లే నా పాత బట్టలకు కూడా కొత్త రూపం ఇస్తున్నాను. ప్రతి నిర్ణయం, ప్రతి పని ముఖ్యమైనదే. నాకు మీ(ఫ్యాన్స్) హృదయాల్లో స్థానం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు" అని పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత పెళ్లి గౌను కోసమే చర్చ నడుస్తోంది. సమంత ఇన్ స్టా పోస్ట్ కోసం అంతా తెగ మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

పెళ్లి గౌనును సామ్ ఇలా చేయడం పట్ల చాలా మంది చైతూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ డ్రెస్ ను ఇలా చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. మేకోవర్ కోసం ఆ డ్రెస్ ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడుగుతున్నారు. ఇక సమంత ఫ్యాన్స్.. దీనిని సాహసమైన చర్యగా వర్ణిస్తున్నారు. పాత జ్ఞాపకాలు మర్చిపోవడానికి అలా చేసి ఉంటుందని చెబుతున్నారు. కొందరు ఇది రివెంజ్ అని కూడా అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సమంత పెళ్లి గౌను విషయం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News