#గుసగుస.. సమంత సీక్రెట్ పోస్ట్ ఎవరిపై?
అంతేకాదు సమంత ఓ క్రిప్టిక్ పోస్ట్ ని షేర్ చేయడంతో అది ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తోంది.
గ్రీస్ దేశంలో పర్యటిస్తోంది సమంత. ఏథెన్స్‌లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. అక్కడి నుంచి కొన్ని ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు సమంత ఓ క్రిప్టిక్ పోస్ట్ ని షేర్ చేయడంతో అది ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తోంది.
ముఖ్యంగా మీడియాలో సామ్ మాజీ భర్త నాగ చైతన్య పెళ్లి గురించిన పుకార్లు షికార్ చేస్తుండగా.. ఇప్పుడు ఈ క్రిప్టిక్ పోస్ట్ దేనికోసం? అంటూ సమంతపై సందేహం వ్యక్తమవుతోంది. తాజాగా షేర్ చేసిన ఈ పోస్ట్‌లో ఒక సింపుల్ సందేశం ఉంది. ''మీ వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి'' అనేది దీని అర్థం. సమంతా రాశిచక్రం వృషభరాశి.. దీని అర్థం బలమైన వ్యక్తిత్వం.. స్వయం ప్రేరేపిత ప్రతిభ.. తిరుగులేని ఆత్మ నిబ్బరం కలిగిన వ్యక్తి అని భావించాల్సి ఉంది. అయితే ఈ సమయంలో సామ్ ఇలాంటి పోస్టింగ్ చేయడానికి కారణమేమిటి? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.
శోభిత ధూళిపాళతో నాగ చైతన్య పెళ్లి పుకార్లు ఆన్‌లైన్‌లో వచ్చిన కొద్ది గంటలకే సామ్ ఇలాంటి పోస్ట్ చేయడంపై ఎన్నో సందేహాలు అలుముకున్నాయి. సమంత కొన్ని వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొని.. మయోసైటిస్ తో ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత కూడా కంబ్యాక్ అవ్వడానికి కారణం తన బలమైన వ్యక్తిత్వం. మొక్కవోని ధీక్ష, పట్టుదల తనకు శ్రీరామ రక్ష అని అంగీకరించాలి. ఇటీవల సొంత బ్యానర్ ని స్థాపించి ఇందులో బంగారం అనే చిత్రాన్ని మొదటి చిత్రంగా ప్రకటించింది. ఆకాశంలో చుక్కకు మెరుపు అద్దనవసరం లేదు. సమంత కూడా అంతే!