అమ్మడు అక్కడా? ఇక్కడా? అన్నింటానా!
సమంత నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న సమంత ఒక్క సారిగా ఎవ్వరూ ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చింది
సమంత నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న సమంత ఒక్క సారిగా ఎవ్వరూ ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చింది. ట్రలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించింది. మండోవా మీడియా వర్క్స్ తో కలిసి ఈ సంస్థని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. న్యూ జెనరేషన్ కంటెంట్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది.
లో బడ్జెట్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు తన నిర్మాణ సంస్థ టార్గెట్ గా పనిచేయనుంది. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ నిర్మాణ సంస్థని ఏ భాషలో యాక్టివ్ గా ముందుకు తీసుకెళ్తాది? అన్నది ఆసక్తికరం. ఈ విషయాన్ని మాత్రం అమ్మడు రివీల్ చేయలేదు. సమంత టాలీవుడ్ సహా కోలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ రెండు పరిశ్రమల నుంచి సమంతకు భారీ ఫాలోయింగ్ ఉంది.
పరిచయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సమంతనే ఓ బ్రాండ్ గా ఈ రెండు పరిశ్రమలు భావిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో ఇంకా సినిమాలైతే ఇంకా చేయలేదు గానీ..ప్లానింగ్స్ అయితే భారీగానే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో నార్త్ రీజియన్ లోనూ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం 'సీటాడెల్' ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. ఈసిరిస్ తో అమ్మడి పేరు మరింత ఫేమస్ అవుతుందని ధీమాగా ఉంది.
ఈ నేపథ్యంలో సమంత కొత్త నిర్మాణ సంస్థ ఏ భాష టార్గెట్ గా సినిమాలు నిర్మిస్తుంది? అన్నది సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. బాలీవుడ్ లో ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టింది. అక్కడ తాప్సీ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. అలాగే కరణ్ జోహర్ లాంటి వాళ్లు అమ్మడిని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఈ పరిచయాలు అన్నింటిని ఉపయోగించి సమంత తన నిర్మాణ సంస్థను ఎంతవరకూ ముందుకు తీసుకెళ్తుంది అన్నది చూడాలి. ఆమె సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూడు పరిశ్రమల కంటెంట్ ని ప్రొడ్యూస్ చేసే ఆలోచనలోనే సమంత ఉన్నట్లు గుస గుస వినిపిస్తుంది.