సమంతను ట్రోల్స్‌కు గురి చేసిన విజయ్ దేవరకొండ
"ఓ రోజు షూటింగ్ సమయంలో దర్శకుడు శివ నిర్వాణ వేసుకున్న తన భార్య టాటూ చేసి సామ్ షాకైంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో, టెలివిజన్ మీడియాలో ట్రోలింగ్, ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. చాలా సార్లు కాంట్రవర్సీలకు కూడా గురైంది. అయితే ఆమెకు హేటర్స్ ఎంత మంది ఉన్నా.. అదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచేవారు అంతే మంది ఉన్నారు. విషయానికొస్తే ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి టోల్స్‌కు గురైంది. అది కూడా విజయ్ దేవరకొండ కామెంట్స్ వల్ల.
ప్రస్తుతం విజయ్-సమంత కలిసి 'ఖుషి' అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్ చేస్తోంది. విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ సమంత మాత్రం తన పర్సనల్ రీజన్స్‌తో అమెరికా టూర్‌కు వెళ్లిపోయింది.
కానీ ఆమె కూడా విజయ్‌తో కలిసి ఇప్పటికే రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే వీటిలోని ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్ మాట్లాడుతూ.. "ఓ రోజు షూటింగ్ సమయంలో దర్శకుడు శివ నిర్వాణ వేసుకున్న తన భార్య టాటూ చేసి సామ్ షాకైంది. అప్పుడు ఆమె 'నువ్వు పెద్ద తప్పు చేశావ్' అని శివతో చెప్పింది" అని గుర్తుచేసుకున్నాడు.
ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ వైరల్ అయ్యాయి. మీమర్స్ అయితే మీమ్స్ రూపంలో సమంత కామెంట్స్‌ను తెగ షేర్ చేస్తున్నారు. సమంత తనకు డివొర్స్ అయిన కారణంగా, అన్నీ జంటలకు ఎప్పటికైనా డివొర్స్ అవ్వాల్సిందేనన్న కోణంలో శివతో అలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. ఆమె కామెంట్స్‌ను తప్పుబడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఇదే సమయంలో ఇంకొంతమంది సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. 'నిజానికి సమంత దర్శకుడితో ఉన్న చనువుతో అలా సరదాగా కామెంట్స్ చేసింది' అని చెబుతున్నారు. అక్కడి కాంటెక్ట్స్ను చాలా అర్థంచేసుకోవట్లేదని పేర్కొంటున్నారు. కావాలనే కొంతమంది ఇలాంటి చీప్ ట్రోల్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు.