'యానిమ‌ల్' స్పీడ్ కి బ‌హదూర్ బ్రేక్ వేస్తాడా?

ట్రైల‌ర్ తో 'యానిమ‌ల్' పై అంచ‌నాలు ఒక్క‌సారిగా పీక్స్ చేరాయి. 2023 బెస్ట్ ట్రైల‌ర్ గా మార్కెట్ లో దూసుకుపోతుంది

Update: 2023-11-26 13:22 GMT

ట్రైల‌ర్ తో 'యానిమ‌ల్' పై అంచ‌నాలు ఒక్క‌సారిగా పీక్స్ చేరాయి. 2023 బెస్ట్ ట్రైల‌ర్ గా మార్కెట్ లో దూసుకుపోతుంది. వ్యూస్ ప‌రంగా రికార్డుల మీద రికార్డులు కొడుతుంది. దీంతో 'యానిమ‌ల్' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా క‌నిపిస్తున్నాయి. 24 గంట‌ల్లోనే యాభై వేల‌కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. పీవీఆర్.. సినీ పోలీసు నుంచే ఈ రేంజ్ లో టికెట్లు తెగాయి. ఇంకా మిరాజ్..మూవీ మ్యాక్స్ ..ప్ర‌సాద్ ఐమాక్స్ వంటివి యాడ్ అవ్వ‌లేదు.

అవి కూడా క‌లిస్తే లెక్క అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఇంకా ప్రీమియ‌ర్లు క‌న్ప‌మ్ కాలేదు. అది క‌న్ప‌మ్ అయితే రిలీజ్ కి ముందే మోతెక్కిపోతుంది. ఇక పాజిటివ్ టాక్ వ‌స్తే గ‌నుక యానిమ‌ల్ వేగాన్ని పాన్ ఇండియాలో ఆప‌డం అన్న‌ది అసాధ్య‌మే అవుతుంది. సినిమాకున్న బ‌జ్ నేప‌థ్యంలో యానిమ‌ల్ స్పీడ్ ని ఇంకే సినిమా అందుకోలేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. స‌రిగ్గా ఇదే టెన్ష‌న్ ఇప్పుడు 'సామ్ బ‌హ‌దూర్' ని వెంటాడుతోంది.

యానిమ‌ల్ రిలీజ్ క్రేజ్ లో సామ్ బ‌హ‌దూర్ క్రేజ్ కిల్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. వాస్త‌వానికి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కానీ యానిమ‌ల్ కి పోటీగా బ‌రిలోకి దిగ‌డంతో కొంత స్థ‌బ్ధ‌త ఏర్ప‌డింది. భార‌త సైనుకుడి బ‌యోపిక్ ఆధారంగా సామ్ బ‌హ‌దూర్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమాల‌కు నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ సామ్ బ‌హదూర్ తో పొలిస్తే వీక్ గానే క‌నిపిస్తుంది. క‌మ‌ర్శియ‌ల్ సినిమాకున్న క‌నిపిస్తోన్న క్రేజ్ బ‌యోపిక్ కి క‌నిపించ‌డం లేదు అన్న బెంగ వెంటాడుతుంది.

'యానిమ‌ల్' బుకింగ్స్ ఫుల్ అవ్వ‌గా ఓవ‌ర్ ప్లో సామ్ బ‌హ‌దూర్కి ట‌ర్న్ అవుతుంద‌ని భావిస్తున్నారు. కానీ ఇదంతా గెస్సింగ్ మాత్ర‌మే. అంతిమంగా నిర్ధారించేది తొలి షో టాక్ అనంత‌రం అన్న‌ది గుర్తు పెట్టుకో వాల్సి అంశం. భారీ అచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన సినిమాలు బోల్తా కొట్టిన సంద‌ర్భాలెన్నో ఉన్నాయి. కొమ్ములు తిరిగిన హీరోలే! ప్లాప్ తో సైలెంట్ అయ్యారు. బ‌యోపిక్ కి హిట్ టాక్ వ‌స్తే నార్త్ రీజియ‌న్ లో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల మోత మామూలుగా ఉండ‌దు. 'యానిమ‌ల్' ఏమాత్రం అటు ఇటు అయినా...బ‌హ‌దూర్ బెట‌ర్ అనిపిస్తే సీన్ మొత్తం మారిపోతుంద‌న్న‌ది గ్ర‌హించాలి.

Tags:    

Similar News