కృషితో నాస్తి దుర్భిక్షం.. సమీరాలో ఎంత మార్పు?
ప్రస్తుతం ఈ కొత్త ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా శారీలో సమీరా ఫోటోషూట్ యూత్ హృదయాలను గెలుచుకుంది.
తెలుగు-తమిళం-హిందీ పరిశ్రమల్లో నటించింది సమీరారెడ్డి. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహితురాలిగాను బోలెడంత పాపులారిటీ ఘడించింది. మెగాస్టార్ చిరంజీవితోను సమీరా రొమాన్స్ చేసింది. కొన్నేళ్ల క్రితం ప్రముఖ బిజినెస్ మేన్ అక్షయ్ వార్ధేని పెళ్లాడి దాంపత్య జీవనంలో అడుగుపెట్టింది. తనకు పండంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిల్లలు పుట్టాక సమీరారెడ్డి మారిన రూపం అమాంతం మారిపోయింది. పొట్ట నాభి చుట్టూ క్రాక్స్.. ఊబ శరీరం.. పండిపోయిన వెంట్రుకలతో వికారంగా అవ్వడంపై బోలెడన్ని కామెంట్లు వినిపించాయి. అయితే ఈ రూపం వల్ల తాను మీడియా ముందుకు వచ్చేందుకు కూడా జంకానని సమీరా స్వయంగా అంగీకరించింది. ఆత్మన్యూనతలోకి వెళ్లిపోయానని తనను నెటిజనులు తీవ్రంగా దూషించారని కూడా తెలిపింది.
అయితే ఈ పరిస్థితి నుంచి తనను తాను బయటపడేసేందుకు సమీరా చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడు ప్రతిఫలిస్తోంది. మారిన రూపంతో సమీరా తన అభిమానులకు బిగ్ షాకిస్తోంది. చూస్తుంటే ఇద్దరు పిల్లలకు మామ్ అని ఎవరూ అనలేరు. అంతగా తన రూపం మారింది. సమీరా తిరిగి నటనలోకి కంబ్యాక్ అయ్యేందుకే ఈ మార్పు అంటూ ఇప్పటికే మేకర్స్ పసిగట్టేసారు. ప్రస్తుతం ఈ కొత్త ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా శారీలో సమీరా ఫోటోషూట్ యూత్ హృదయాలను గెలుచుకుంది.
దాదాపు పదేళ్లుగా మీరు నటనకు దూరంగా ఉన్నారు. స్టార్ డమ్ కోల్పోయినట్టు అనిపించిందా? అని తాజా ఇంటర్వ్యూలో సమీరాను ప్రశ్నించగా.. నేను ప్రతిరోజూ దాన్ని కోల్పోతున్నాను అంటూ ఓపెనైంది. ఎందుకంటే అది (నటన) నా రక్తంలో ఉంది. మనం చిన్నప్పటి నుండి ఏదైనా చేసి వదిలేసినప్పుడు అలా అనిపిస్తుంది. నిజానికి నేను బాలీవుడ్ లో నటించకపోయినా ఫర్వాలేదు. కానీ దక్షిణాది చిత్రాలలో భాగం కానప్పుడు ఏదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. నేను హిందీలో నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు కూడా దక్షిణ భారతీయురాలిగా పూర్తి గౌరవాన్ని ఎప్పుడూ పొందలేదని అమ్మా నాన్న అనుకున్నారు. అదంతా సరే కానీ ..నేను సౌత్ ఇండియన్ సినిమాలు చేయడం ప్రారంభించిన రోజు అది నా అదృష్టం. దానికి చాలా కృతజ్ఞురాలిని. అలాగే నా తల్లిదండ్రులు దాని గురించి చాలా ఆనందంగా గర్వంగా ఉన్నారు'' అని తెలిపారు.
ఒంటరిగా బాధపడేవారికి సలహా:
బాడీ పాజిటివిటీ అంబాసిడర్‌గా ఉండటం వల్ల నా జీవితమంతా నేను ఎప్పుడూ చాలా శరీర ఇమేజ్ సమస్యలను ఎదుర్కొన్నాను. నేను ఎప్పుడూ స్లిమ్‌గా ఉండే అమ్మాయిని కాదు. పాత్రల కోసం బరువు తగ్గడం నాకు పెద్ద కష్టంగా అనిపించేది కాదు. పిల్లలు పుట్టిన తర్వాత, ఒక మహిళగా నేను మాట్లాడాలని భావించాను. ఎందుకంటే చాలామంది దీనిని ప్రశ్నిస్తారు. నేను బరువు పెరగడాన్ని రూపం మారడాన్ని నిర్భయంగా అంగీకరించాను. ఇకపై దాచడానికి ఇష్టపడలేదు. నేను ఒక వ్యక్తిగా భావించాను. నేను నిలబడి, ఒత్తిడికి గురవుతున్న వ్యక్తుల సంఘం కోసం మాట్లాడితే, బహుశా మనం దాన్ని మెరుగుపరుచుకోవచ్చు కాదా? అయినా ఎక్కువ మంది వృద్ధాప్యం గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడతారు? అనేది నా ప్రశ్న. ఇది చాలా మంది నన్ను అడిగారు. ప్రజలు మంచి అనుభూతులను కలిగి ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా ఉండేవారు, ఒంటరితనంతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. వారికంటే ఉత్తమంగా ఉన్నానని భావిస్తాను.. అని సమీరా అన్నారు.