81 లోనూ అదే స్పీడ్.. ద‌టీజ్ బిగ్ బీ!

ఆ రోజుల్లో అమితాబ్ ఎలాంటి సినిమాలు చేసేవారు...కాలంతో పాటు ఆయ‌న మారిన విధానం...న‌వ‌త‌రం న‌టుల‌తో ఆయ‌న ప‌నిచేస్తున్న విధానంపై త‌మ‌దైన శైలి పోస్టుల‌తో అభిమానం చాటుకుంటున్నారు. 500 తో మొద‌లైన అమితాబ్ నేడు వేల కోట్ల కు అధిప‌తి.

Update: 2023-10-11 09:31 GMT

బాలీవుడ్ లెజెండ్ అమితాబ‌చ్చ‌న్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో అంచలం చెలుగా ఎదిగిన న‌టుడాయ‌న‌. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కొచ్చి స‌క్సెస్ అయిన న‌టుడు. నాలుగు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన మార్క్ చిత్రాల‌తో అల‌రిస్తున్నారు. హిందీ సినిమాల‌తో పాటు ద‌క్షిణాది చిత్రాల్లోనూ కీల‌క పాత్ర‌ల్లో మెప్పిస్తున్నారు. నేటితో ఆ లెజెండ‌రీ 81వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. ఈ సంద‌ర్బంగా అమితాబ్ కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు భారీ ఎత్తున శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. అమితాబ్ ఐకానిక్ చిత్రాల గురించి స్మ‌రించుకుంటున్నారు. ఆ రోజుల్లో అమితాబ్ ఎలాంటి సినిమాలు చేసేవారు...కాలంతో పాటు ఆయ‌న మారిన విధానం...న‌వ‌త‌రం న‌టుల‌తో ఆయ‌న ప‌నిచేస్తున్న విధానంపై త‌మ‌దైన శైలి పోస్టుల‌తో అభిమానం చాటుకుంటున్నారు. 500 తో మొద‌లైన అమితాబ్ నేడు వేల కోట్ల కు అధిప‌తి.

నివేదిక‌ల ప్ర‌కారం ఆయ‌న ఆస్తి విలువ నాలుగు వేల‌కు కోట్ల‌కుపైగానే ఉంటుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం ఆయ‌న ఒక్కో సినిమాకి 5 నుంచి ప‌ది కోట్ల మ‌ధ్య‌లో ఛార్జ్ చేస్తున్నారు. కొన్నిసార్లు స్నేహ సోద‌ర భావంతో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సంద‌ర్భాలున్నాయి. వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఏటా ఆదాయం భారీగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఒక్కో ప్ర‌క‌ట‌ని ఐదు కోట్లు ఛార్జ్ చేస్తారుట‌.

సినిమాలు..ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఆయ‌న ఆదాయం 100 కోట్ల వ‌రకూ ఉంటుంద‌ని అంచ‌నా. ఇంకా ఇత‌ర వ్యాపారాలు...ముంబైలో ఖ‌రీదైన ప్రాంతాల్లో విల్లాలు..అపార్టుమెంట్లు ఉన్నాయి. ఆయ‌న జుహూ ప్రాంతాంలో జ‌ల్సా అనే బంగ్లా లో నివ‌సిస్తున్నారు. దీని విలువ దాదాపు 100 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఎన్నో బ్రాండెడ్ కార్లు ఆయ‌న సోంతం. ప్ర‌ముఖ కంపెనీ ల‌గ్జ‌రీ కార్లు అన్ని ఉన్నాయి. బిగ్ బీ ఆస్లులు...సంపాద‌న ప‌క్క‌న‌బెడితే 81 లోనూ న‌టుడిగా అదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఈ వ‌య‌సులోనూ నేటి త‌రం హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ సినిమాలు చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు సినిమాలు ఎక్కువ‌గా చేసున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్..మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు అమితాబ్ కంటే వ‌య‌సులో చిన్న‌వారైనా! ఆయ‌న వేగాన్ని మాత్రం అందుకోలేక‌పోతున్నారు. 81 లోనూ దూకుడు చూపిస్తూ ద‌టీజ్ బిగ్ బీ అనిపిస్తున్నారు.

Tags:    

Similar News