సమంత ఆ సిరీస్ నుంచి ఔట్!
ఇంతవరకూ ఈ సిరీస్ రిలీజ్ ఎప్పుడు? అన్నది ప్రకటించలేదు. మళ్లీ రిలీజ్ తేదీ ప్రకటిస్తే తప్ప మంత ఆ వెబ్ సిరీస్ పనుల్లో భాగం కాదు.
'ఖుషీ' తర్వాత సమంత అమెరికా లో రిలాక్స్ అవుతోన్న సంగతి తెలిసిందే. అన్నిరకాల టెన్షన్ ల నుంచి రిలీఫ్ కావాలని అమ్మడు కొన్ని నెలలుగా అక్కడే ఉంటుంది. అయినా ఇక్కడ యాక్టివిటీస్ వేటిని ఆపలేదు. తన టీమ్ ద్వారా అన్ని రకాల సమాచారం అందుకుంటూ వాటిని యధావిధిగా కొనసాగిస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ 'సీటాడెల్' డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఆ సిరీస్ నుంచి షూట్...డబ్బింగ్ పనులు ముగించి బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పట్లో సమంత అవసరం సీటాడెల్ కి లేదని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ సిరీస్ రిలీజ్ ఎప్పుడు? అన్నది ప్రకటించలేదు. మళ్లీ రిలీజ్ తేదీ ప్రకటిస్తే తప్ప మంత ఆ వెబ్ సిరీస్ పనుల్లో భాగం కాదు. మళ్లీ ప్రచారం కోసమే టీంతో కలిసి పనిచేయనుందని తెలుస్తోంది. ఇది హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ అన్న సంగతి తెలిసిందే.
ఇండియన్ వెర్షన్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించగా ఆ ఛాన్స్ సమంతకి వచ్చింది. అయితే హాలీవుడ్ లో ఈ సిరీస్ డిజాస్టర్ గా మిగిలింది. వేల కోట్లు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఈసిరీస్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాజ్ అండ్ డీకే సీటాడెల్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. భారతీయులకు అర్దమయ్యే రీతిలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సిరీస్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది రిలీజ్ అవ్వడం ఖాయమే. మరి రిలీజ్ తేది ఎప్పుడు వస్తుంది? అన్నది చూడాలి. ప్రస్తుతం సమంత కూడా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలు తగ్గించి హిందీ పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నాలు సీరియస్ గానే చేస్తోంది. మరి సమంత డెబ్యూ ఏ చిత్రం అవుతుందన్నది చూడాలి.