సమంతపై ఈ పుకార్ నిజమేనా?
ఇటీవల అలాంటి మరో పుకార్ సమంతపై జోరుగా షికార్ చేస్తోంది. సమంత త్వరలోనే ప్రెస్ ముందుకు వస్తోందని, చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తుందంటూ కొత్త పుకార్ పుట్టుకొచ్చింది.
సూపర్ ట్యాలెంటెడ్ క్వీన్ సమంత గురించి నిరంతరం ఏదో ఒక వార్త వెబ్ మాధ్యమంలో ప్రచారంలో ఉంటోంది. మయోసైటిస్ లేదా సమంత సొంత దుస్తుల బ్రాండ్ 'సాకి' గురించి లేదా సమంత పెళ్లి బ్రేకప్ గురించి ఏదో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎక్కువగా పుకార్లు షికార్ చేస్తున్నాయి.
ఇటీవల అలాంటి మరో పుకార్ సమంతపై జోరుగా షికార్ చేస్తోంది. సమంత త్వరలోనే ప్రెస్ ముందుకు వస్తోందని, చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తుందంటూ కొత్త పుకార్ పుట్టుకొచ్చింది. అయితే సమంత మీడియా ముందుకు ఎందుకు వస్తోంది? అంటే.. తనపై సాగుతున్న రకరకాల ప్రచారాలకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు మీడియా ఎదుటకు వస్తోంది అన్న ప్రచారం సాగుతోంది. అంతేకాదు సమంత మ్యారేజ్ బ్రేకప్ అనంతర ఆలోచనల గురించి వస్తున్న పుకార్లను ఖండిస్తుందని ఒక సెక్షన్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఇంకొందరైతే సమంత సొంత దుస్తుల బ్రాండ్ 'సాకి' ప్రచారం కోసం ప్రెస్ ముందుకు వస్తోందని కూడా ప్రచారం సాగిస్తున్నారు. ఇంతకీ సమంత దేనికోసం మీడియా ముందుకు వస్తోంది? అంటే ఇప్పుడు దానికి అసలైన సమాధానం లభించింది. నవంబర్ 10న 'మార్వెల్స్' #TheMarvels అనే ఇంగ్లీష్ సినిమా తెలుగులో విడుదలవుతోంది. దానికి ప్రచారానికి స్థానిక పంపిణీవర్గాలు సమంత ని తెలుగులో ప్రచారానికి ఎన్నుకున్నారు. కేవలం ఈ మూవీ ప్రచారం కోసం మాత్రమే సమంత హైదరాబాదులో ప్రెస్ ముందుకు వస్తోందని ఒక సోర్స్ ద్వారా తెలిసింది. కానీ ఈ ప్రెస్ మీట్ కి చాలా ప్రాధాన్యత ఉంది అంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం సాగిస్తోంది. ఇది సమంత వ్యక్తిగత సమావేశం కానే కాదు. కేవలం ప్రొఫెషనల్ గా తన బాధ్యత మాత్రమేనని గ్రహించాలి.
సాకి బ్రాండ్ వెలుగులు:
సమంత ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగేస్తోంది. ఇప్పటికే తన సొంత దుస్తుల శ్రేణి కాలీ 'సాకి'ని పరిచయం చేయడం ద్వారా వస్త్ర వ్యాపారంలోకి ప్రవేశించింది. దీనిని సమంతా రూత్ ప్రభు- సుశ్రుతి కృష్ణ కలిసి రూపొందించారు. సమంత ఈ బ్రాండ్ కి కావాల్సిన ప్రచారాన్ని తెస్తోంది.
ఇటీవల, సమంతా విమానాశ్రయంలో అందమైన పసుపు రంగు కుర్తా ధరించి కనిపించింది, దీనికి జతగా ఆరెంజ్ దుపట్టా, ఎథ్నిక్ ప్యాంట్ ఆకట్టుకున్నాయి. కొన్ని నెలల క్రితం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు నటనకు విరామం ఇస్తున్నట్లు సామ్ ప్రకటించి వార్తల్లో నిలిచారు. మయోసైటిస్ అనే అరుదైన రుగ్మతకు విదేశాల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.