కింగ్ తో సంపూ బౌన్స్ బ్యాక్ అవ్వగలడా?

ఈ మార్టిన్ లూథర్ కింగ్​.. పంచాయ‌తీ ఎలక్షన్స్​ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈ సినిమా.. ఊరులో స్థానికంగా చెప్పులు కుట్టే ఓ వ్యక్తి కథ.

Update: 2023-10-14 14:29 GMT

హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్​లో త‌న‌కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కమెడియన్ కమ్​ హీరో సంపూర్ణేశ్ బాబు. స్ఫూఫ్ కామెడీలతో మంచి క‌మ‌ర్షియ‌ల్‌ సక్సెస్​లను కెరీర్ ప్రారంభంలోనే అందుకున్నారు. కానీ ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా ఏదీ వర్కౌట్​ కాలేదు. అన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.


ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా గ్యాప్ ఇచ్చి పొలిటిక‌ల్ కామెడీ చిత్రం మార్టిన్ లూథర్ కింగ్​తో ఆడియెన్స్​ ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మూవీ సభ్యులంతా జోరుగా ప్రమోషన్స్​ కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటన చేస్తూ రోజుకో ఊరు తిరుగుతున్నారు. ప్రెస్​ మీట్లు పెడుతూ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్ వంటి నగరాల్లో ముందస్తు ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రీమియర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వస్తోందని టాక్ వినిపిస్తోంది.


ఇప్పటికే రిలీజైన ట్రైలర్​ కూడా బాగానే ఆకట్టుకుంది. సినిమాలో సంపూర్ణేశ్​ బాబుతో పాటు దర్శకుడు వెంక‌టేష్ మ‌హా, న‌రేశ్ ఇతర కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని అక్టోబ‌ర్ 27న థియేట‌ర్ల‌లో విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఓ కోలీవుడ్ సినిమాకు రీమేక్ అని కూడా అంటున్నారు. త‌మిళంలో యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మండేలా సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు.

ఈ మార్టిన్ లూథర్ కింగ్​.. పంచాయ‌తీ ఎలక్షన్స్​ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈ సినిమా.. ఊరులో స్థానికంగా చెప్పులు కుట్టే ఓ వ్యక్తి కథ. అతడి ఊరిలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని గట్టిగా పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతడి ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడం వల్ల అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే కథ.

చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఎప్పుడో చివరిసారిగా 2021లో క్యాలిఫ్లవర్​తో వచ్చిన ఆయన.. ఇప్పుడు రెండేళ్ల తర్వాత వస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వగలతారో లేదో చూడాలి..

Tags:    

Similar News