చీరలో సంయుక్త గ్లామర్ ఘాటు
సంయుక్తా తన తాజా గ్లామర్ లుక్ తో సోషల్ మీడియా ప్రపంచాన్ని మరోసారి ఉపేస్తోంది. ఈ ఫోటోల్లో ఆమె ధరించిన పసుపు, పింక్ కలర్ కాంబినేషన్ చీర ఆమె అందాన్ని మరింత హైలెట్ చేస్తూ కనిపిస్తోంది.
సంయుక్తా తన తాజా గ్లామర్ లుక్ తో సోషల్ మీడియా ప్రపంచాన్ని మరోసారి ఉపేస్తోంది. ఈ ఫోటోల్లో ఆమె ధరించిన పసుపు, పింక్ కలర్ కాంబినేషన్ చీర ఆమె అందాన్ని మరింత హైలెట్ చేస్తూ కనిపిస్తోంది. చెవిపోగులు, మెడలో పూసలహారం, అలాగే కంచు బ్రాస్‌లెట్ లాంటి ఆభరణాలతో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. సంయుక్తా తన ఈ లుక్ కోసం చాలా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంయుక్త ఎలా కనిపించినా అందంగానే ఉంటుందని మరోసారి నిరూపించింది. ఫ్యాషన్ డ్రెస్సులలోనే కాకుండా చీరలో కూడా తన వయ్యారంతో మైమరిపిస్తోంది. ఇక సంయుక్తా కెరీర్ విషయానికి వస్తే, ఆమె తన ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రయాణాన్ని మలయాళ చిత్రాల ద్వారా ప్రారంభించి, తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమధ్య ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఆమె ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో నటిస్తోంది, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడిక్ ఫిల్మ్ ద్వారా సంయుక్తా తన నటనతో అభిమానులను ఆకట్టుకోబోతుందని పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక సంయుక్తా తన ఫోటోషూట్ల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమెను మరింత దగ్గరగా కలిపేలా చేస్తున్నాయి.
ఒకవైపు ఆమె త్రెండిషనల్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తుంటే, మరోవైపు గ్లామర్ లుక్స్ లో కూడా ఆమె తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఇక రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే, సంయుక్తా ప్రముఖ హీరోలతో కలిసి పలు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో కీలక చిత్రం రామ్, మోహన్ లాల్ సరసన ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. అదేవిధంగా, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాలలో కూడా ఆమె మెయిన్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది.