హీరోయిన్‌ని తొలగించి బాధపెట్టాను: సందీప్ వంగా
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మొదటిసారి రణబీర్ కపూర్ - రష్మిక మందన్నలతో సందీప్ వంగా మొదటిసారిగా పని చేసారు. అయితే గీతాంజలి (రష్మిక పాత్ర) పాత్రను పోషించడానికి పరిణీతి చోప్రా మొదటి ఎంపిక. సందీప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం తెలిపారు. లుక్ టెస్ట్ చేసినప్పుడు పరిణీతి పాత్రకు సరిపోలేదని తాను భావించానని చెప్పాడు. ఇదే విషయంలో చాలా బాధపడ్డాడని కూడా పేర్కొన్నాడు.
సందీప్ రెడ్డి వంగా `యానిమల్` డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఇప్పుడు ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతాతో ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ, కబీర్ సింగ్ -యానిమల్ చిత్రాలకు పరిణీతి చోప్రా ప్రాథమిక ఎంపిక. గీతాంజలి (యానిమల్ లో రష్మిక) పాత్రకు లుక్ టెస్ట్ చేసినప్పుడు పరిణీతి సూటవ్వలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు తనను కాదనడం నా తప్పు... నన్ను క్షమించమని చెప్పాను అని అన్నాడు. షూట్‌కు ఒకటిన్నర సంవత్సరాల ముందు ఆమె (పరిణీతి చోప్రా) సంతకం చేసింది. కొన్ని కారణాల వల్ల ఆమెలో గీతాంజలిని చూడటం కుదరలేదు. కుచ్ కుచ్ పాత్రలు కుచ్ కుచ్ లోగో కో సెట్ నహీ హోతా హై (కొన్ని విషయాలు వర్కవుట్ కాలేదు) అని అన్నాడు.
నేను ఆడిషన్‌లను నమ్మను. నేను నా ప్రవృత్తితో మాత్రమే వెళ్తాను. అది నాకు తెలుసు. మొదటి రోజు నుండి నేను పరిణీతి నటనను ఇష్టపడ్డాను. నేను ఎప్పుడూ నా సినిమాలో పరిణీతి నటించాలని కోరుకున్నాను. కబీర్ సింగ్ లో ప్రీతి పాత్రకు పరిణీతి వర్కవుట్ కాలేదు అని తెలిపాడు. చాలా కాలంగా నేను పరిణీతితో కలిసి పని చేయాలనుకుంటున్నాను. నేను తనకు చెప్పాను..ఆమెకు కూడా తెలుసు. ``సారీ .. సినిమా కంటే పెద్దది ఏమీ లేదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకొని మరొక ఆర్టిస్ట్‌తో ముందుకు వెళ్తున్నాను`` అని చెప్పింది. ఆమె బాధ పడింది. కానీ నేను ఎందుకు అలా చెబుతున్నానో ఆమెకు అర్థమైంది! అన్నారు.
సందీప్ రెడ్డి వంగా రచించి దర్శకత్వం వహించిన `యానిమల్`లో రణబీర్ కపూర్ నటనతో పాటు, రష్మిక పాత్రకు గొప్ప పేరొచ్చింది. బహుశా పరిణీతి దురదృష్టవంతురాలు. ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్ని సందీప్ రెడ్డి వల్లనే కోల్పోయింది. యానిమల్ లో అనీల్ కపూర్, బాబీ డియోల్, ట్రిప్తీ డిమ్రీ తదితరులు నటించారు. తండ్రీకొడుకుల మధ్య సాగే బాంధవ్యమే ఈ చిత్రం. ప్రతీకారంతో రగిలిపోయే క్రూరమైన రణవిజయ్ పాత్రను రణబీర్ పోషించాడు.