ఆయ‌న‌తో సినిమా ఊరేగినంత వీజీ కాదా!

ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

Update: 2024-12-08 20:45 GMT

'అర్జున్ రెడ్డి', 'యానిమ‌ల్' సినిమాల‌తో సందీప్ రెడ్డి వంగ‌ పాన్ ఇండియాలో డైరెక్ట‌ర్ గా ఎంత ఫేమ‌స్ అయ్యాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌డు హీరోల్ని నెక్స్ట్ లెవ‌ల్లో చూపిస్తాడ‌ని రెండు సినిమాల‌తోనే రుజువు చేసాడు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ టాప్ స్టార్లు అంతా అత‌డితో సినిమాలు చేయ‌డానికి క్యూలో ఉన్నారు. అత‌డు ఎప్పుడు పిలుస్తాడా? అని చాలా మంది హీరోలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.


కానీ అదంత ఈజీ కాదు. సందీప్ క‌థ‌కు సెట్ అయ్యే హీరోలు కుదిరిన‌ప్పుడే వాళ్ల‌కు పిలుపు వెళ్తుంది. కానీ సందీప్ తో సినిమా చేయ‌డం అంటే అంత వీజీ కాద‌న్న‌ది గుర్తించాలి. 'అర్జున్ రెడ్డి'లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంతో ఎఫెర్ట్ పెట్టి ప‌నిచేస్తాడు. సందీప్ చెప్పింది చెప్పిన‌ట్లు చేసాడు కాబ‌ట్టి ఆరేరంజ్ స‌క్సెస్ అయింది. అటుపై 'యానిమ‌ల్' కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ క‌ష్ట‌మంతా తెర‌పై క‌నిపించింది. బాలీవుడ్ లో అత‌డు గ్రేట్ యాక్ట‌ర్ కావ‌డంతోనే సందీప్ అత‌న్ని తీసుకుని ముందుకెళ్లి స‌క్సెస్ కొట్టాడు.

ఇదే సినిమా మ‌హేష్ ని చేయ‌మంటే నా వ‌ల్ల కాదంటూ చేతులెత్తేసిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ క‌పూర్ చేసిన పాత్ర‌ను తాను మాత్రం చేయ‌లేన‌ని ఓపెన్ గానే అన్నారు మ‌హేష్‌. కానీ మ‌హేష్ కోసం సందీప్ రాసుకున్న క‌థ అంత‌క‌న్నా ఘోరంగా ఉంటుంద‌ని ఓ సంద‌ర్భంలో సందీప్ తెలిపాడు. మ‌రి ఆ ఘెర‌మైన క‌థ‌ని ఎప్పుడు తెర కెక్కిస్తాడు? అన్న‌ది చూడాలి. సందీప్ తో సినిమా చేయాలంటే హీరో అత‌డికి బాండ్ అయి ప‌నిచేయాలి. చెప్పింది చెప్పిన‌ట్లు చేయాలి.

సందీప్ కంప్లీట్ న్యూ ఏజ్ మేక‌ర్. మేకింగ్ లో ఓ కొత్త ట్రెండ్ ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడు. ద‌ర్శ‌క దిగ్గ‌జం రాంగోపాల్ వ‌ర్మ సైతం ఇప్పుడు సినిమా ఎలా తీయాల్లో అత‌డి వ‌ద్ద చూసి నేర్చుకోవాలి అన్నారు? అంటే సందీప్ స్థాయిని అంచ‌నా వేయోచ్చు. సందీప్ క‌థ‌లంటే ర‌ఫ్ గానూ ఉంటాయి. అంతే రొమాంటిక్ గాను ఉంటాయి. వాటిలో వేటిలోనైనా హీరో నో చెప్ప‌కుండా న‌టించాలి. రొమాన్స్..యాక్ష‌న్ ఏదైనా స‌రే స‌హ‌జ‌త్వాన్ని త‌ల‌పించాలి. ప్రేక్ష కుడికి రియ‌లిస్టిక్ అనుభూత‌ని పంచాలి. సందీప్ తో క‌లిసి ప‌నిచేయాలంటే ఇవ‌న్నీ త‌ప్ప‌ని స‌రి. అంత ద‌మ్ముంటేనే అత‌డి కాంపౌండ్ లోకి ఎంట‌ర్ అవ్వాలి.

Tags:    

Similar News