రొమాన్స్ రసవత్తరం అవ్వడానికి కారణం?
సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎంత ఘాడంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎంత ఘాడంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమా `అర్జున్ రెడ్డి`తోనే తానెంత రొమాంటిక్ అన్నది పరిచయం చేసాడు .అటుపై `యానిమల్` లోనూ ఆ విధానాన్ని యధావిధగా కొనసాగించాడు. ఓ వైపు సీరియస్ గా కథ నడుపుతూనో మరోవైపు రొమాన్స్ కి అంతే ప్రాధాన్య ఇచ్చాడు. ఇది సహజంగా హాలీవుడ్ సినిమా పార్మెట్. టాలీవుడ్..బాలీవుడ్ లోనూ అదే పార్మెట్ ని అనుసరించి సక్సెస్ అయిన దర్శకుడు సందీప్.
తన రెండు చిత్రాలకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సందీప్ సినిమాలు సక్సెస్ అవ్వడానికి...యూత్ లో అంత క్రేజ్ గా ఉండటానికి కారణం కూడా రొమాన్స్ అన్నది కీలక పాత్ర పోషిం చడం అన్నది గుర్తించాల్సిన అంశం. అయితే ఈ విషయంలో క్రెడిడ్ అంతా సందీప్ కి కట్టబెట్టా ల్సిన పనిలేదు. తన విజన్ ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం ఆ పాత్రల్లో నటించిన నటీనటులు మాత్రమే. వాళ్లే గనుక అంత గొప్పగా పెర్పార్మెన్స్ ఇవ్వకపోతే సందీప్ ఎంత ప్రయత్నించినా ఔట్ ఫుట్ అన్నది అంత గొప్పగా రాదు.
రొమాంటిక్ సన్నివేశాలు అనే సరికి పరిమిత క్రూతోనే చేస్తారు. ఆ పాత్ర ధారులు..కెమెరా మ్యాన్.. దర్శకుడు...మహా అయితే మరో ఇద్దరు కలుపుకుని ఓ ఐదుగురు ఉంటారు. బెడ్ రూమ్ సీన్లు చేసే సమయంలో వీలైనంత వరకూ తక్కువ మెంబర్లు ఉండేలా చూసుకుంటారు. సీన్ ఇలా ఉండాలని దర్శకుడు చెబుతాడు. దానికి తగ్గట్టు నటీనటులు నటిస్తారు. ఒక్కో సందర్భంలో డైరెక్టర్ నేరుగా ఆ సీన్ లో హీరోయిన్ తో నటించే ఛాన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఓ డైరెక్టర్ ఇలా ప్రయత్నిం చినా....తెరపై అంతిమంగా కనిపించేది హీరో-హీరోయిన్ల సన్నివేశాలే కాబట్టి. వాళ్ల మధ్య అండ్ స్టాండింగ్ అన్నది అత్యంత ముఖ్యమైనది. `అర్జున్ రెడ్డి`లో విజయ్- షాలిని పాండే మధ్య రొమాన్స్ అంత గొప్ప గా పండిందంటే? వాళ్లిద్దరే కారణం. అలాగే `యానిమల్` లో రణబీర్ -రష్మిక మందన్నా రొమాన్స్ అయినా.... రణబీర్ -త్రీప్తి డిమ్రి మధ్య బెడ్ రూమ్ సీన్ పండిందన్నా? కారణం అందులో నటీనటులే.
నటుటు ఇద్దరు సహకరించుకోవడంతో అలాంటి సన్నివేశాలు తెరపై పండానికి ఛాన్సు ఉంటుంది. కో ఆర్డినేషన్ అన్నది ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకరి కొకరు ఒకర్ని అర్దం చేసుకుంటూ చేయాల్సిన సన్నివేశాలవి. ఆ రకంగా రణబీర్ తనకెంతో సౌకర్యవంతమైన వాతావరణం కల్పించినట్లు త్రీప్తి అభి ప్రాయపడింది. అలాగే విజయ్ తో షాలిని పాండే సీన్స్ కూడా గొప్పగా పండాయంటే కారణం విజయ్ అని అప్పట్లో షాలిని కూడా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.