సందీప్ రెడ్డి సినిమా అటు ఇటు అయ్యిందో..
యువ దర్శకుడు సందీప్ రెడ్డి ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా సంచలనమే. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
యువ దర్శకుడు సందీప్ రెడ్డి ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా సంచలనమే. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ తర్వాత హిందీలో తెరకెక్కించిన దీని రీమేక్ ‘కబీర్ సింగ్’ ఇంకా పెద్ద విజయం సాధించింది. ఇక మూడో మూవీ ‘యానిమల్’ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఐతే సందీప్ తీసిన ప్రతి సినిమా వసూళ్లతో పాటు అనేక వివాదాలనూ మూటగట్టుకుంది.
తన హీరోల పాత్రలు.. వాటి సిద్ధాంతాలు.. మాటల పట్ల చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐతే బయటి వాళ్లు ఎవరో సినిమాను విమర్శించడం వేరు.. సినిమా వాళ్లే తప్పుబట్టడం వేరు. తన సినిమాలు యువత ఆలోచనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వారిలో యారొగెన్స్ పెంచుతాయని.. మహిళల పట్ల పురుషాధిక్యతను గ్లోరిఫై చేసేలా తన సినిమాలు ఉంటున్నాయని జావెద్ అక్తర్ సహా చాలామంది తప్పుబట్టారు.
ఐతే తన సినిమాలను విమర్శించిన క్రిటిక్స్‌తో పాటు సినిమా వాళ్ల మీదా సందీప్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నాడు. వాళ్లొక మాట అంటే అతను నాలుగు మాటలు అంటున్నాడు. సందీప్ ఇలా దీటుగా బదులివ్వడం తన ఫ్యాన్స్‌కు నచ్చుతోంది. కానీ బాలీవుడ్ ప్రముఖులను, అలాగే మీడియా వాళ్లను ఇలా డీల్ చేయడం భవిష్యత్తులో అతడికి ఇబ్బంది తెచ్చి పెడుతుందేమో అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
తెలుగు దర్శకుడైన సందీప్ బాలీవుడ్లోకి వచ్చి జయకేతనం ఎగురవేయడం పట్ల అక్కడి వాళ్లు అసూయ పడుతుండొచ్చు. అలాగే సందీప్ కాన్ఫిడెన్స్, యారొగెన్స్ వారికి నచ్చుతుండకపోవచ్చు. గతంలో రామ్ గోపాల్ వర్మ సైతం ఇలాగే బాలీవుడ్ వాళ్లను ఒక ఆట ఆడుకున్నాడు. కానీ వర్మ ఫాంలో ఉంటూ హవా సాగించినంత కాలం అంతా బాగానే ఉంది.
కానీ అతడి టైం తిరగబడ్డపుడు తన సినిమాలను బాలీవుడ్ క్రిటిక్స్‌తో పాటు సినీ జనాలు కూడా గట్టిగా టార్గెట్ చేశారు. దీంతో తన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోవడం మొదలైంది. ఇప్పుడు సందీప్ తీరు నచ్చని వాళ్లు అతడి సినిమా కొంచెం అటు ఇటు అయితే అప్పుడు చూసుకుందాం అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు అతణ్ని, తన సినిమాను వాళ్లు మామూలుగా టార్గెట్ చేయరు. మరి వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాక్సాఫీస్ దగ్గర ప్రతిసారీ సందీప్ హవా సాగిస్తాడేమో చూద్దాం.