ఫార్ములా పక్కనపెట్టిన దర్శకుడు సందీప్ వంగా: రాజమౌళి
రాజమౌళి మాట్లాడుతూ-``ప్రతి సంవత్సరం కొత్త కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు తీస్తారు. సూపర్ హిట్స్ తీస్తారు.
సినిమా అంటే ఫక్తు ఫార్ములాటిక్ గా తీయాలనుకునే దర్శకులనే చూశాం. కానీ అన్ని ఫార్ములాస్, రూల్స్ పక్కన పెట్టి సినిమాలు తీసే దర్శకులు అరుదుగానే కనిపిస్తుంటారని అన్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. రణబీర్ -సందీప్ వంగా కాంబినేషన్ మూవీ యానిమల్ ప్రీరిలీజ్ వేడుకలో జక్కన్న మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఈ వేదికపై దర్శకుడు సందీప్ వంగాకు రాజమౌళి అత్యుత్తమ కాంప్లిమెంట్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ తర్వాత మళ్లీ అలాంటి అరుదైన దర్శకుడు సందీప్ వంగా అని రాజమౌళి అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ-``ప్రతి సంవత్సరం కొత్త కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు తీస్తారు. సూపర్ హిట్స్ తీస్తారు. చాలా పేరు తెచ్చుకుంటారు. ఇలాంటివారిని మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. కానీ ఒక దర్శకుడిని చూస్తే ప్రేక్షకులను అందరినీ షేక్ చేస్తారనిపిస్తుంది. ఫార్ములాని బ్రేక్ చేసి సినిమాలు చేసే వాళ్లు అప్పుడప్పుడు వస్తారు. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ను చూసాను. తర్వాత మళ్లీ ఫార్ములాస్ ని పక్కన పెట్టి సినిమా తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ టీజర్ చూడగానే నేను ఈ సినిమా చూడాలి అని ఫిక్సయిన సినిమా ఇది. టీజర్ తోనే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలి అని అనుకున్నాను. డిసెంబర్ 2న ప్రయాణం ఉంది. అందుకే డిసెంబర్ 1 రాత్రి నేను యానిమల్ చూసేస్తున్నాను`` అని అన్నారు.
రణబీర్ ఇంటెన్స్ ఉన్న నటుడు. నేను ఇంతకుముందే చెప్పాను. ఇంటెన్సిటి.. వల్నరబిలిటీ ఉన్న ఏకైక హీరో అతడు. తనను నటుడిగా నిరూపించుకునేందుకు తక్కువ సినిమాలు పడ్డాయి. యానిమల్ అతడి కెరీర్ బెస్ట్ అవుతుంది. టీమ్ ఎంతో హార్డ్ వర్క్ చేసారు. డిసెంబర్ 1న ఈ సినిమాని థియేటర్లలో చూడండి.. అని అన్నారు. ఇదే వేదికపై తెలుగు ఆడియెన్ గొప్పతనాన్ని రాజమౌళి కీర్తించారు. ``మన ఆడియెన్స్ ఎలా ఉంటారో.. వారి ప్రేమ ఎలా ఉంటుందో.. వారి అరుపులు కేకలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ బాంబే నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మన ఆడియెన్స్ ఎలా ఉంటారో చూపించాలనిపిస్తుంటుంది. ఈరోజు రణబీర్ భూషణ్ అనీల్ కపూర్ బాబీ వచ్చారు. మా ఆడియెన్ ఇలా ఉంటారు అని చూపించినందుకు ఆనందంగా ఉంది`` అని కూడా రాజమౌళి అన్నారు.