సందీప్ వంగా రెమ్యునరేషన్.. ఆ లెవెల్లో..

దీంతో సందీప్ కు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని వినికిడి. సందీప్ కు రూ.100 కోట్ల చెక్ అందిందని సమాచారం.

Update: 2024-03-13 16:30 GMT

సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయారు. సినిమా అంటే ఇలాగే తెరకెక్కించాలన్న కట్టుబాట్లు ఏం లేకుండా చాలా బోల్డ్ గా తీసి.. అటు విమర్శలతో పాటు ఓ రేంజ్ లో ప్రశంసలు కూడా అందుకున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా రాబట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఓటీటీలో స్క్రీమింగ్ అవుతూ అక్కడ కూడా రికార్డులు సృష్టిస్తోంది. అయితే అర్జున్ రెడ్డి సినిమా తీయడం కోసం 36 ఎకరాల మామిడి తోట అమ్ముకున్న సందీప్.. యానిమల్ మూవీ ద్వారా భారీగా రెమ్యునరేషన్ తో లాభాలు అందుకున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. ఇక యానిమల్ మూవీకి సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా.. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. టీ-సిరీస్ తో కలిసి నిర్మించారు. దీంతో సందీప్ కు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని వినికిడి. సందీప్ కు రూ.100 కోట్ల చెక్ అందిందని సమాచారం.

ఇప్పుడు సందీప్ రెమ్యునరేషన్ పైనే నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. రూ.100 కోట్ల పారితోషికానికి సందీప్ అర్హుడేనా అని మాట్లాడుకుంటున్నారు. సందీప్ కు యానిమల్ మూవీ జాక్ పాట్ అని కామెంట్లు పెడుతున్నారు. సినీ లవర్స్ లో సందీప్ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేసి వారిని థియేటర్లకు రప్పిస్తాయి. దీంతో మేకర్స్ కు మంచి లాభాలు రావడంతో సందీప్ కు రూ.100 కోట్లు ఇవ్వడంలో ఎవరూ వెనకాడరు.

అయితే సందీప్ కు నిజమైన సవాలు ఏంటంటే.. ఇండస్ట్రీలో ఇదే రెమ్యునరేషన్ కొనసాగించడం. ఇది కష్టమే అయినా కొనసాగించి తీరాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక సందీప్ తన నెక్స్ట్ సినిమా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్నారు. తన స్టైల్ తోనే.. వేరే జోనర్ లో స్పిరిట్ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీని కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తే.. సందీప్ రూ.100 కోట్ల డైరెక్టరేనని ప్రూవ్ చేసుకోవడం పక్కా.

Tags:    

Similar News