యానిమల్ పై సందీప్ ఏడేళ్ల కొడుకు రియాక్షన్ ఏంటంటే..!
గత ఏడాది విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యానిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ వంగ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.
గత ఏడాది విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యానిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ వంగ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. కబీర్ సింగ్ తో అక్కడ గుర్తింపు దక్కించుకున్న సందీప్ యానిమల్ సినిమాతో అక్కడ టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరి పోయాడు.
రెండు నెలలుగా యానిమల్ సినిమాను దర్శకుడు సందీప్ ఏదో విధంగా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. పదుల కొద్ది ఇంటర్వ్యూలు ఇస్తూనే వచ్చాడు. తాజాగా మరో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సందీప్ వంగ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ చూసిన సమయంలో వారి రియాక్షన్ ఏంటి అనేది చెప్పుకొచ్చాడు.
మీ ఏడు ఏళ్ల బాబు యానిమల్ సినిమా చూశాడా... చూసిన సమయంలో అతడి రియాక్షన్ ఏంటి అంటూ సందీప్ ను ఇంటర్వ్యూవర్ ప్రశ్నించాడు. సందీప్ అందుకు సమాధానంగా.. ఏ సర్టిఫికెట్ సన్నివేశాలను తొలగించి యానిమల్ సినిమాను ఒక హార్డ్ డిస్క్ లో భద్రపరిచాను.
గోవాలో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా యానిమల్ సినిమా వేశాం. అప్పుడు నా కొడుకు చూశాడు. అతడికి సినిమా నచ్చింది. నా భార్య రక్తపాతం కు సంబంధించిన సన్నివేశాలపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. హీరోయిన్స్ విషయంలో కూడా ఆమె సంతృప్తి పడ్డట్లు అనిపించలేదు.
నేను ఏ సినిమా చేసినా కూడా నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను. రెగ్యులర్ ప్రేక్షకుల మాదిరిగా ప్రణయ్ నా సినిమాకు రివ్యూ ఇస్తాడు. అతడి అంచనా ప్రకారమే సినిమా జనాల్లోకి వెళ్తుందని సందీప్ వంగ అన్నాడు.
సందీప్ తన తదుపరి సినిమాను ప్రభాస్ తో చేయబోతున్న విషయం తెల్సిందే. గత ఇంటర్వ్యూలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను ఈ ఏడాదిలోనే మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. స్పిరిట్ మాత్రమే కాకుండా యానిమల్ పార్క్ మరియు అల్లు అర్జున్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.