సందీప్ వంగా Vs అట్లీ.. ఇదెక్కడి గొడవ సామీ!
తమిళ్ సినిమా బ్యాచ్ తో పాటూ షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ని అట్లీని టార్గెట్ చేస్తుంటే, కొందరు తెలుగు వాళ్లతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ సందీప్ రెడ్డి వంగని టార్గెట్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని హీరోల అభిమానులు తెగ గొడవ పడుతుంటారు. ఈ గొడవల్లో ఎక్కువగా స్టార్ హీరోల ఫ్యాన్స్ గ్రూపులే ఉంటున్నాయి. అయితే ఈసారి మాత్రం అలాకాకుండా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ఆ డైరెక్టర్స్ మరెవరో కాదు ఒకరేమో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, మరొకరు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.
తమిళ్ సినిమా బ్యాచ్ తో పాటూ షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ని అట్లీని టార్గెట్ చేస్తుంటే, కొందరు తెలుగు వాళ్లతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ సందీప్ రెడ్డి వంగని టార్గెట్ చేస్తున్నారు. ఫిలిం మేకింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగా కంటే అట్లీ ఎన్నో మైళ్ళ ముందు ఉన్నాడని తమిళ సినిమా గ్రూప్ చెప్పడంతో ఈ ఫ్యాన్ వార్ మొదలైంది. వాళ్ల కథనం ప్రకారం.. 'జవాన్ వెయ్యి కోట్ల సినిమా అని, షారుక్ ఖాన్ ఫ్యాన్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారని..
తమ అభిమాన హీరోకి 1000 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీకి ఫ్యాన్స్ అయిపోయారు'. దీనికి సందీప్ రెడ్డి వంగా ని సపోర్ట్ చేసేవాళ్లు.. 'జవాన్ 1000 కోట్ల సినిమా కాదని, అన్ని హిట్ సినిమాలు కలిపితేనే ఆ సినిమా' అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అట్లీ ఫ్యాన్స్ Vs వంగా ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్ మొదలైంది.
సందీప్ రెడ్డి వంగ కొత్తదనం లేని సినిమాలు తీస్తాడని.. అట్లీ ఫాన్స్ కామెంట్ చేస్తే, అట్లీ కాపీ మాస్టర్ అని.. అతనికి ఇతర సినిమాల నుంచి కాపీ పేస్ట్ చేయడం మాత్రమే తెలుసు' అని వంగా ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియా అంతటా అట్లీ Vs వంగ ఫ్యాన్ వార్ నడుస్తోంది. అసలు వీళ్ళ మధ్య ఫ్యాన్ వార్ స్టార్ట్ అవ్వడానికి కారణం ట్విట్టర్లో యానిమల్ వర్సెస్ జవాన్ సినిమాల మధ్య ఆర్గ్యుమెంట్ జరగడమే. ఇప్పుడు ఈ గొడవ కాస్త తెలుగు వర్సెస్ తమిళ్ క్లాష్ గా మారింది.
నిజానికి ఈ ఇద్దరూ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ అని చెప్పాలి.ఎవరి మేకింగ్ స్టైల్ వాళ్లది. తమ మేకింగ్ తో ఇద్దరూ నార్త్ లో సత్తా చాటారు. షారుక్ తో జవాన్ సినిమా తీసి అట్లీ రూ.1000 కోట్లు కొల్లగొట్టగా సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ త్వరలోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.