సంక్రాంతి సినిమాలు.. ఈవెంట్స్ తో పెద్ద ఛాలెంజ్
ఈ జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండగా జనవరి 13 సైంధవ్, జనవరి 14న నా సామిరంగా సినిమా థియేటర్స్ లోకి వస్తోంది.
సంక్రాంతి ఫెస్టివల్ కి టాలీవుడ్ లో ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారంతో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, కింగ్ నాగార్జున నా సామిరంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండగా జనవరి 13 సైంధవ్, జనవరి 14న నా సామిరంగా సినిమా థియేటర్స్ లోకి వస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలకి సంబందించిన ప్రమోషన్స్ ఇప్పటికే నడుస్తున్నాయి. సినిమాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా చేసుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్స్ విషయంలో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం గుంటూరు కారం టీమ్ జనవరి 6న డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. హనుమాన్ మూవీ టీమ్ జనవరి 7న ప్రీరిలీజ్ ఎవెన్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తారు. అదే రోజు వెంకటేష్ సైంధవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతోంది. ఇప్పుడు గుంటూరు కారం టీమ్ అనుకున్న జనవరి 6 క్యాన్సిల్ కావడంతో జనవరి 8న ఈవెంట్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఎప్పుడైనా ప్రీరిలీజ్ ఈవెంట్ లు వీకెండ్స్ లోనే నిర్వహించడం అలవాటుగా వస్తోంది. ఆ సమయంలో ఎక్కువ మంది క్రౌడ్ వస్తారని నమ్మకంతో వీకెండ్స్ లో వచ్చే డేట్స్ కి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం టీమ్ కి జనవరి 6న ఛాన్స్ లేకపోవడంతో అయితే జనవరి7న సండే రోజు నిర్వహించాలి. లేదంటే వీకెండ్ తో సంబంధం లేకుండా 8న పెట్టుకోవాలి.
నిర్మాత ఇంట్రెస్ట్ బట్టి ఈవెంట్ ఎప్పుడనేది క్లారిటీ వస్తుంది. ఒకే రోజు మూడు ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తే మాత్రం మీడియా కవరేజ్ కి చాలెంజ్ అవుతుందనే మాట వినిపిస్తోంది. అలాగే సినిమా ఈవెంట్స్ కి ఎక్కువగా సుమ హోస్ట్ గా ఉంటారు. ఇప్పటికే హనుమాన్ కి ఆమె డేట్స్ ఇచ్చేసింది. దీంతో మిగిలిన సినిమాలకి చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ విషయం గుంటూరు కారం టీమ్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి.