సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్.. వాళ్ళు హ్యాపీ

2024 సంక్రాంతి కానుకగా తెలుగులో ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే

Update: 2023-12-27 06:07 GMT

2024 సంక్రాంతి కానుకగా తెలుగులో ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వీటిలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఈగల్, సైంధవ్ చిత్రాలు డిసెంబర్ 13న రిలీజ్ కానున్నాయి. నా సామి రంగా మూవీ డిసెంబర్ 14న రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీస్ లో వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం.


ఇదిలా ఉంటే ఈ ఐదు సినిమాలలో మూడు చిత్రాలకి సంబందించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ ధరకి కొనుగోలు చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకి కొనుగోలు చేసింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ సైంధవ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ మీద పాన్ ఇండియా లెవల్ లో భారీ హైప్ ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులని జీ5 సొంతం చేసుకోవడం విశేషం.

ఇక రవితేజ ఈగల్, కింగ్ నాగార్జున నా సామి రంగా సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ఇంకా అమ్ముడుకాలేదు. వీటిపై ప్రస్తుతం చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులని ఎవరు దక్కించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాల సంక్రాంతి రిలీజ్ కి సంబంధించి ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

దీంతో ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్మాతలు అందరితో చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిర్మాతలలో ఒకరైనా సంక్రాంతి రేసు నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి. హనుమాన్ సినిమాని మాత్రం ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యి ఉన్నారు. నా సామి రంగా మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. కింగ్ నాగ్ సంక్రాంతి రేసు నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News