సంక్రాంతి సినిమాల ఓవర్సీస్ టార్గెట్స్ ఎంతంటే?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు జనవరి 12న థియేటర్స్ లోకి వస్తున్నాయి. సైంధవ్ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతోంది. జనవరి 14న నా సామి రంగా మూవీ ప్రేక్షకులని అలరించడానికి రాబోతోంది. ఈ సినిమాలు డిఫరెంట్ జోనర్స్ తో ప్రేక్షకులని ఎంటెర్టైన్ చేయబోతున్నాయి.
సంక్రాంతి సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా అత్యధిక బ్రేక్ ఈవెన్ టార్గెట్ కలిగి ఉంది. మిగిలిన సినిమాలు అన్ని మినిమమ్ రేంజ్ లోనే ఉన్నాయి. ఆడియన్స్ ఇంట్రస్ట్ కూడా ఎక్కువగా గుంటూరు కారం సినిమాపైనే ఉంది. నెక్స్ట్ హనుమాన్ పట్ల ఆసక్తికరంగా ఉన్నారు. ఈ సినిమాలు ఓవర్సీస్ లో కూడా సాలిడ్ బిజినెస్ చేసుకున్నాయి.
గుంటూరు కారం సినిమాపై ఓవర్సీస్ లో 21 కోట్ల వ్యాపారం జరిగింది. హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ కాబోతోంది. గుంటూరు కారం అక్కడ హిట్ కొట్టాలంటే 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత హనుమాన్ సినిమాకి కూడా ఓవర్సీస్ లో సాలిడ్ బిజినెస్ కావడం విశేషం. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాలి.
సైంధవ్ మూవీ కూడా ఇదే స్థాయిలో బిజినెస్ చేసుకొని 1 మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీకి కూడా మంచి బిజినెస్ జరిగింది. 2 కోట్లకి ఈ మూవీ రైట్స్ అమ్ముడయినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 660 కె డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమాలకి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా ఈ మధ్యకాలంలో భారీగానే వస్తున్నాయి. దీంతో సంక్రాంతి సినిమాలకి కూడా మంచి రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రోజు రోజుకి బుకింగ్ నెంబర్ పెరుగుతోంది.