సంక్రాంతి స్టార్లు అంతా క్లీన్ గానే!
అవి ఓటీటీలో కి అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసుకోవడంతో తప్ప థియేటర్లో వెసులు బాటు లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
ఏడాది ముగింపులో రిలీజ్ అయిన `యానిమల్`...`సలార్` చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చినా? 18 ఏళ్ల లోపు యువకుల్ని మాత్రం నిరుత్సాహ పరిచిన సంగతి తెలిసిందే. పెద్దలకు మాత్రమే ఈ సినిమాలంటూ మార్కెట్ లో కి వచ్చాయి. భారీ వయోలెన్స్..హింస...కృరత్వం లాంటి అంశాలు ఆయా సినిమాలకు క్లీన్ సర్టిఫికెట్ లభించలేదు. సెన్సార్ ఇచ్చిన పట్టా ప్రకారం `ఏ` ట్యాగ్ తో రిలీజ్ అయ్యాయి. దీంతో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఆ సినిమాలు థియేటర్లో దూరమయ్యాయి. అవి ఓటీటీలో కి అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసుకోవడంతో తప్ప థియేటర్లో వెసులు బాటు లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
అయితే సంక్రాంతి రిలీజ్ లు మాత్రం దాదాపు క్లీన్ గానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే యువ హీరో తేజ సజ్జ నటించిన `హనుమాన్` సెన్సార్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి యూ ఏ సర్టిపికెట్ వచ్చింది. దీంతో ఈసినిమాకి సెన్సార్ నుంచి ఎలాంటి అడ్డంకులు లేవని తేలిపోయింది. ఎలాంటి కట్ లేకుండా రిలీజ్ అవుతుంది. ఇక విక్టర్ వెంకటేష్ తొలి పాన్ ఇండియా చిత్రం `సైంధవ్` కూడా జనవరి 13 నరిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి కూడా సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికెట్ వచ్చింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న `గుంటూరు కారం` కూడా క్లీన్ గానే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాల్లో మరీ ఓవర్ గా హింస ఉండు. అసభ్యతకు అస్సలు ఛాన్సే ఉండదు. ఇంతవరకూ ఆయన సినిమాలకు ఏ సర్టిఫికెట్ వచ్చింది కూడా లేదు. దీంతో `గుంటూరు కారం` కూడా క్లీన్ గానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మాస్ రాజా రవితేజ నటిస్తోన్న `ఈగిల్` కూడా జనవరి 13న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా కూడా ఎలాంటి కట్ లేకుండానే రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా నాగార్జున నటిస్తోన్న `నా సామిరంగ` రిలీజ్ అవుతుందా? లేదా? అని ఇంతసేపు సస్పెన్స్ కొనసాగింది. తాజాగా కొద్ది సేపటి క్రితమే క్లారిటీ వచ్చేసింది. జనవరి 14న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమా కూడా సెన్సాన్ నుంచి క్లీన్ సర్టిఫికెట్ లభించే అవకాశం ఉంది. ఇలా సంక్రాంతి రిలీజ్ లన్నీ దాదాపు క్లీన్ గానే ఉండే అవకాశం ఉంది.