సంక్రాంతికి వస్తున్నాం: బుకింగ్స్ తో హీటెక్కించేలా..
ఈ సినిమా తరువాత జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం.. గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
సంక్రాంతి పండుగ సీజన్‌లో పర్ఫెక్ట్ గా ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేందుకు తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ హడావుడి మొదలయ్యింది. కానీ సినిమాకు అనుకున్నంత టాక్ రాలేదు. ఇక డాకు మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తరువాత జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం.. గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాపై క్రేజ్ ఊహించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తోంది.
అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ అలాగే వెంకటేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా కలిసొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతుండగానే టిక్కెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. సినిమాపై ఉన్న ఆసక్తి కారణంగా బుకింగ్స్ మొదలైనప్పటి నుండి థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ కాకపోయినప్పటికీ, సినిమా హడావుడి అద్భుతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా బుక్ మై షోలో గంటకు గంటకు సంక్రాంతికి వస్తున్నాం ట్రెండింగ్‌లో నిలుస్తుండటం విశేషం. ఇది ప్రేక్షకులు సినిమాను ఎంతగానో ఎదురు చూస్తున్నారనే అంశాన్ని స్పష్టంగా రుజువు చేస్తోంది. సినిమాపై ఉన్న ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, థియేటర్ యజమానులు ఎక్కువ షోల ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి పండుగ సీజన్ వినోదానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నందున, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశముంది. ఇంతకుముందు వెంకీ - అనిల్ సినిమాలకు వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను సూచిస్తోంది. 50 కోట్ల కంటే తక్కువ బ్రేక్ ఈవెన్ తో ఈ సిమిమా మార్కెట్ లోకి రానుంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా చిత్ర బృందం మంచి ఆదాయాన్ని సాధించిందని సమాచారం. ఈ క్రేజ్ కొనసాగితే, తొలి రోజునే వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం.
సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ సినిమాకు గోల్డెన్ టైమ్. అయితే, ఈసారి విడుదలవుతున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కథ, మ్యూజిక్, నటనలతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, కామెడీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశం ఎక్కువ. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.