ఇద్ద‌రితో బ్రేక‌ప్.. స్టార్ డాట‌ర్ నిజాయ‌తీ

ప్ర‌ముఖ స్టార్ హీరో కుమార్తె ఇప్ప‌టికి ఇద్ద‌రితో ప్రేమాయ‌ణాలు సాగించింది. అయితే ఆ ఇద్ద‌రితో డిఫ‌రెన్సెస్ వ‌చ్చి విడిపోయింది

Update: 2023-11-09 15:33 GMT

ప్ర‌ముఖ స్టార్ హీరో కుమార్తె ఇప్ప‌టికి ఇద్ద‌రితో ప్రేమాయ‌ణాలు సాగించింది. అయితే ఆ ఇద్ద‌రితో డిఫ‌రెన్సెస్ వ‌చ్చి విడిపోయింది. ఈ విష‌యాన్ని ప‌బ్లిక్ వేదిక‌పై ఎలాంటి దాప‌రికం లేకుండా స్వ‌యంగా అంగీక‌రించింది. తాను ఆ ఇద్ద‌రు హీరోల‌తో డేటింగ్ చేసిన విష‌యాన్ని ఈ భామ ఎప్పుడూ దాచుకోదు. ప్ర‌తిసారీ ఓపెన్ గా చెప్పేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్. తొలుత కేదార్ నాథ్ ఫేం సుశాంత్ సింగ్ తో ప్రేమ‌లో ప‌డిన ఈ భామ ఆ త‌ర్వాత అత‌డి నుంచి దూర‌మైంది. త‌ర్వాత కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న న‌టించిన క్ర‌మంలో అత‌డితో ప్రేమ‌లో ప‌డింది. ఈ రెండు డేటింగుల్ని సారా నిజాయితీగా అంగీక‌రించింది. అయితే ఆ రెండూ బ్రేక‌ప్ అయ్యాయి. తిరిగి తాను స‌ద‌రు హీరోల‌తో స్నేహంగా ఉంటాన‌ని సారా తెలిపింది.

త‌న‌దైన అందం న‌ట‌న‌, సూటిగా ఉండే త‌త్వంతో సారా ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీపై కుర్ర‌కారులో విప‌రీత‌మైన ఆస‌క్తి. ఇప్పుడు సారా అలీఖాన్ త‌న డేటింగుల గుట్టును మ‌రోసారి విప్పింది. అభిమానుల అన్ని సందేహాల‌ను క్లియ‌ర్ చేసింది. 'కాఫీ విత్ కరణ్ 8' షో మూడవ ఎపిసోడ్‌లో సారా అలీ ఖాన్ -అనన్య పాండే కనిపించారు. సారా మరోసారి తన బిందాస్ వైఖరితో హృదయాలను గెలుచుకుంది.

సారా త‌న స్నేహాలు, సంబంధాల గురించిన రూమర్‌లను హ్యాండిల్ చేసే విధానం ఇతర B-టౌన్ భామ‌ల‌కు భిన్న‌మైన వ్య‌క్తిత్వం అని చెబుతాయి. సారా తాను క‌ర‌ణ్‌ షోలో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు కార్తిక్ ఆర్యన్‌తో తన రిలేష‌న్ షిప్ పుకార్ల గురించి అడగకుండా KJo విడిచిపెట్టడు అని ముందే ఊహించింద‌ట‌.

కార్తిక్ ఆర్యన్‌తో విడిపోవడం గురించి, అత‌డితో స్నేహం చేయడం గురించి కరణ్ జోహార్ నేరుగా సారాను ప్రశ్నించారు. ముఖ్యంగా అతడి నుంచి విడిపోయిన తర్వాత... తిరిగి స్నేహం చేసిందా లేదా? అనే విష‌యాన్ని అడిగాడు. బ్రేకప్‌లను మేనేజ్ చేయ‌డం గురించి సారా చాలా సాధారణంగా సమాధానం ఇచ్చింది. అయితే బ్రేక‌ప్ ని మేనేజ్ చేయ‌డం అంత సులభం కాదని సారా స్పష్టంగా చెప్పింది. ``అయ్యా, అంతా ఈజీ అని నేను చెప్పదలచుకోలేదు. ఎందుకంటే అది కొంచెం పనికిమాలినది. ఏదీ ఎల్లప్పుడూ సులభం కాదు. మీరు ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నప్పుడు అది స్నేహితులు అయినా క‌ష్ట‌మైన‌ది. వృత్తిపరంగా, శృంగారపరంగా, ముఖ్యంగా నేనైతే పాలుపంచుకుంటాను. పెట్టుబడి పెడతాను.. పర్వాలేదు అనుకుంటాను.. ఈ రోజు ఏమైనా, రేపు ఏది అయినా! అని మాత్రం నేను అనుకోలేను. ఎందుకంటే అది మ‌న‌పై ప్రభావం చూపుతుంది. కానీ చివరికి మీరు అంతకు మించి ఎదగడానికి ఉప‌క‌రిస్తుంది`` అని సారా చెప్పింది.

ఈ ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు

కార్తిక్ ఆర్యన్ నుంచి విడిపోవడం గురించి సారా అలీ ఖాన్ చాలా పరిణతితో సమాధానమిచ్చింది. బాలీవుడ్‌లో ఏదీ శాశ్వతం కాదని సారా తన అనుభవాన్ని తెలిపింది. నెగెటివ్‌గా తీసుకోకుంటే ఈ బిజినెస్ లో శాశ్వత ఇబ్బందులు లేవని నేను గ్రహించాను. నా వ్యక్తిగత అనుభవంలో శాశ్వతమైన మంచి స్నేహాలను ఏర్పరచుకోవడం, వాగ్దానాలు చేయడం లేదా మీతో ఇంకెప్పుడూ మాట్లాడను అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఇవన్నీ ఎప్పుడూ జ‌రిగేవి కావు.. అని తెలిపింది. ఇప్పుడు సారా కూడా కార్తీక్‌తో స్నేహంగా ఉంది. అతడితో క‌లిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News