సరిపోదా శనివారం. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

నాచురల్ స్టార్ నాని ఆగస్టు 29న సరిపోదా శనివారం సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Update: 2024-08-27 04:36 GMT

నాచురల్ స్టార్ నాని ఆగస్టు 29న సరిపోదా శనివారం సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మూవీ రిలీజ్ అవుతున్న అన్ని భాషలలో ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. నాని కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్లి సినిమాని గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు.

దీంతో ఈ సినిమా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. దసరా లాంటి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సరిపోదా శనివారం చిత్రంతో అందుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ కూడా కాస్త కొత్త పాయింట్ తో ఉండబోతుందని ఇప్పటికే రివీల్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై సాలిడ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 42 కోట్ల ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగిందంట. తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు చాలా కాలం క్రితం 25 కోట్లకు సొంతం చేసుకున్నారంట. ఇప్పుడు దాని బిజినెస్ వ్యాల్యూ 30 కోట్ల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాపై నాని కెరియర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే 43 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

నాని మార్కెట్ తో పోల్చుకుంటే ఇది పెద్ద టార్గెట్ అయితే ఏమీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆయన సినిమా ఈజీగా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 100 కోట్ల కలెక్షన్స్ సునాయాసంగా నాని అందుకుంటారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ దసరా సినిమాకి వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ ని సరిపోదా శనివారం బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో తమిళ్ స్టార్ ఎస్. జె. సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేసింది. సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం. గతంలో అంటే సుందరానికి అనే క్లాస్ మూవీ వచ్చింది. దాని తర్వాత ఈ సారి ఇద్దరు కలిసి మాస్ బొమ్మతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు.

Tags:    

Similar News