టికెట్టు రేటుకి తగ్గట్టే సినిమా ఉంటే..?

ఐతే లేటెస్ట్ గా కల్కి సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం వారి మాట మార్చి చెబుతున్నారు. మనం పెట్టిన టికెట్ ప్రైస్ ని మించి విజువల్ వండర్ ని చూపిస్తే ఆడియన్ సంతృప్తి చెందుతాడు.

Update: 2024-06-28 07:36 GMT

ప్రేక్షకులు సినిమా థియేటర్ కు రావట్లేదని ఈమధ్య బాగా వినిపిస్తున్న మాట. దానికి ఒక రీజన్ సినిమా టికెట్ రేట్లు భారీగా ఉండటం కాగా మరో రీజన్ నెల ఆగితే సినిమాను ఎంచక్కా ఫ్యామిలీ మొత్తం కలిసి ఓటీటీలో చూసేయొచ్చు అనే ఆలోచన. నలుగు కుటుంబ సభ్యులు సినిమాను చూడటానికి థియేటర్ కి వెళ్తే అక్కడ టికెట్లు రేట్లు, మిగిలిన తిండి ఖర్చులు కలుపుకుంటే జేబుకి పెద్ద బొక్కే పడుతుంది. అందుకే ఈమధ్య చాలా మంది రెగ్యులర్ గా సినిమా చూసే వాళ్లు సైతం థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడటం మానేశారు.

 

పోనీ అంత ఖర్చు పెట్టుకుని వెళ్లినా ఒక మంచి సినిమా అందిస్తారన్న నమ్మకం దొరకట్లేదు. సినిమా రిలీజ్ ముందు నానా హంగామా చేసి ప్రేక్షకులను ఆకర్షించడం తీరా సినిమాకు వెళ్లి చూస్తే ఆ టీజర్, ట్రైలర్ లో ఉన్నవే చూపించి నిరాశ పరచడం జరుగుతుంది. దీని వల్ల థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని అనుకున్న వారు తగ్గిపోతున్నారు. పెరిగిన టికెట్ రేట్లను కూడా లెక్క చేయకుండా వెళ్లి సినిమా చూస్తే ఓ పక్క డబ్బులతో పాటుగా తమ టైం కూడా వేస్ట్ అయ్యిందన్న భావన కలుగుతుంది.

ఐతే లేటెస్ట్ గా కల్కి సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం వారి మాట మార్చి చెబుతున్నారు. మనం పెట్టిన టికెట్ ప్రైస్ ని మించి విజువల్ వండర్ ని చూపిస్తే ఆడియన్ సంతృప్తి చెందుతాడు. అందుకే కల్కి సినిమాను 400 పెట్టి టికెట్ కొన్నా ఆ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. టికెట్ రేటు ఎంత పెట్టినా ఇలాంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తే చాలు వాళ్లు ఫిదా అయిపోతారు. కల్కి లాంట్ వర్త్ వాచ్ సినిమాలకు టికెట్ విషయంలో ఆలోచన రాదు.

ఒక గొప్ప సినిమా చూడటానికి 500 ఖర్చు అయ్యాయనే అనుకుంటాడు. కానీ అలా కాకుండా ఒక రొటీన్ టెంప్లేట్ సినిమాను ఇలా అధిక ధరకు చూస్తే మాత్రం మళ్లీ సినిమా థియేటర్ లో చూడాలన్న ఆలోచన కూడా చేయడు. కల్కి ఇచ్చిన ఈ బూస్టింగ్ సినిమాను ఎందుకు థియేటర్ లోనే చూడాలి.. అక్కడ పొందే ఎక్స్ పీరియన్స్ ఏంటన్నది చూపిస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఓటీటీలో చూసినా థియేటర్ ఇచ్చే హై మూమెంట్స్ ఎప్పటికీ ఇవ్వవు. కాబట్టి టికెట్స్ రేటు పెంచినా ఇలాంటి వర్తబుల్ సినిమాలకు ప్రేక్షకులు కూడా పెద్దగా ఆలోచించరని చెప్పొచ్చు.

Tags:    

Similar News