సెప్టెంబర్ ఓటీటీ.. ఆ మూడు సినిమాలకు మోక్షం

మూడు సార్లు డిజిటల్ రిలీజ్ ఎనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకనో ఆగిపోయింది.

Update: 2024-09-04 06:57 GMT

సెప్టెంబర్ నెలలో ఓటీటీలలోకి రాబోయే సినిమాలు కాస్త హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నాయి. చాలా కాలంగా ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్న సినిమాలు ఎట్టకేలకు డిజిటల్ రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు దాటుకొని ఈ సినిమాలు డిజిటల్ స్పేస్ లోకి రాబోతూ ఉండటం విశేషం. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అఖిల్ ఏజెంట్. ఈ సినిమా అఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది.

ఈ సినిమా ఎంతో కాలంగా హోల్డ్ లో ఉంది. మూడు సార్లు డిజిటల్ రిలీజ్ ఎనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకనో ఆగిపోయింది. ఎట్టకేలకి ఏజెంట్ మూవీ సోనీ లివ్ లో ఈ నెల ఆఖరులో రిలీజ్ కాబోతోంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన మూవీ ఓటీటీలో ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి. ఇక ఇదే తరహాలో మనమే సినిమా కూడా గత కొన్ని వారాలుగా హోల్డ్ లో ఉంది. శర్వానంద్, కీర్తి సురేష్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మనమే మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యం అయ్యింది. అయితే ఆ లీగల్ సమస్యలు పరిష్కారం కావడంతో రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో మనమే సినిమా త్వరలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. అలాగే లాల్ సలామ్ కూడా చాలా కాలంగా ఓటీటీలోకి రావాలని అనుకుంటోంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ గెస్ట్ రోల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా 6 నెలలు దాటినా ఓటీటీ మోక్షం పొందలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా 'సన్ NXT' లో సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతోందంట. అలాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ తలవన్ సెప్టెంబర్ 10న సోనీ లివ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి థియేటర్స్ లో పాజిటివ్ టాక్ వచ్చింది. బిజూ మీనన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. ఇక పంజాబీ రొమాంటిక్ కామెడీ మూవీ జట్ & జూలియట్ 3. చౌపాల్ ఓటీటీలో ఈ మూవీ స్టెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

అలాగే హాలీవుడ్ మూవీ ఫాల్ గై మూవీ జియో సినిమాలో సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతోంది. అలాగే కీర్తి సురేష్ నటించిన తమిళ్ మూవీ రఘు తాత సెప్టెంబర్ 13న జీ5లో రిలీజ్ అవుతోంది. ఇలా సెప్టెంబర్ నెలలో అన్ని భాషలకు సంబంధించిన క్రేజీ మూవీస్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏవి డిజిటల్ స్పేస్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయనేది వేచి చూడాలి.

Tags:    

Similar News