సీక్వెల్ అంటే కామెడీ అయిపోయింది!
సినిమాల మధ్య పోటీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతోంది.
సినిమాల మధ్య పోటీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతోంది. పాన్ ఇండియా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యాక దర్శక, నిర్మాతలు అన్ని భాషలలో సినిమాని రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా ఇతర భాషలలో ఆశించిన స్థాయిలో ఆడకున్న ఒటీటీ ద్వారా సాలిడ్ రైట్స్ వస్తాయని ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. అలా ఈ వారం కూడా రెండు సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ తోనే ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
తెలుగులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన స్కంద మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో బోయపాటి మార్క్ యాక్షన్ కేవలం బాలయ్యకి మాత్రమే సెట్ అవుతుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ పెట్టి కథని పూర్తిగా పక్కన పెట్టి హీరోతో ఎన్ని సాహసాలు చేయించిన ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ కాలేదు. కొద్దిగా బీ,సీ సెంటర్ ఆడియన్స్ కి నచ్చుతుంది. అయితే ఇది ఏ స్థాయిలో కలెక్షన్స్ తీసుకొస్తుందనేది చెప్పలేని విషయం.
ఇక లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వచ్చిన చంద్రముఖి2ని పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేశారు. చంద్రముఖి పేరుకి ఉన్న బ్రాండ్ కారణంగా సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అయితే కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ డిజాస్టర్ అయ్యింది. సినిమా సౌండ్ కూడా వినిపించడం లేదు. కంగనా రనౌత్ ఏం చూసి ఈ సినిమా యాక్సప్ట్ చేసిందనేది అర్ధం కాని విషయంగా ఉందనే మాట వినిపిస్తోంది.
ఇక శ్రీకాంత్ అడ్డాల కంప్లీట్ గా తన స్టైల్ నుంచి బయటకొచ్చి పెదకాపు 1 మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. నారప్ప తరహలో గ్రామీణ ప్రాంతాలలో ఆధిపత్య వర్గం, అణచివేతకి గురయ్యే వర్గం మధ్య పోరాటాన్ని తెరపైకి ఆవిష్కరించారు. అయితే కథని నేరట్ చేయడంలో తడబడ్డాడు అనే మాట సినీ విమర్శకుల నుంచి వినిపిస్తోంది. అయితే వీటిలో స్కంద, పెదకాపు సినిమాలకి పార్ట్ 2 కూడా ఉన్నట్లు ముందుగానే చెప్పారు.
ఈ మధ్యకాలంలో సీక్వెల్ ట్రెండ్ భాగా వర్క్ అవుట్ అవుతూ ఉండటంతో సినిమాకి క్లైమాక్స్ లో కొనసాగింపుకి అనే విధంగా కొన్ని సీక్వెన్స్ బిల్డ్ చేసి ఎండ్ కార్డ్ వేయకుండ వదిలేస్తున్నారు. డిజాస్టర్ చిత్రాలకి కూడా సీక్వెల్స్ చేసే ధైర్యం నిర్మాతలు చేస్తారా అనేది వేచి చూడాలి.