శేషారాయణం నాట్ ఇంట్రెస్టెడ్.. ఎందుకంటే..!

సరైన కథ పడితే విజయ్ సేతుపతి కూడా తన డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా అలాంటి కథ తెలుగు నుంచి రాలేదని తెలుస్తుంది.

Update: 2023-08-09 04:37 GMT

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా సరే దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా సినిమాల మీద ఆసక్తితో స్వతహాగా ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతి ఆ తర్వాత సోలో హీరోగా కూడా ఛాన్స్ అందుకున్నాడు. హీరోగా తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తున్న విజయ్ సేతుపతి తమిళంలోనే కాదు సౌత్ అన్ని భాషల్లో ముఖ్యంగా తెలుగులో కూడా సూపర్ పాపులారిటీ సంపాదించాడు.

ఆయన క్రేజ్ చూసే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా చిన్న పాత్రలో మెప్పించాడు విజయ్ సేతుపతి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఆ సినిమాకు స్టార్ క్రేజ్ తెచ్చింది ఆయనే అని చెప్పొచ్చు. అప్పుడే హీరోయిన్ కి తండ్రి పాత్ర ఏంటి అన్న ఆలోచన చేయకుండా తనకు ఇచ్చిన రాయణం పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి సినిమా సూపర్ హిట్ కి ప్రధాన కారణంగా నిలిచారు విజయ్ సేతుపతి.

ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతికి తెలుగు నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ వచ్చాయట. కానీ అన్ని కూడా ఉప్పెన తరహా పాత్రలే అవడం వల్ల ఆయన కాదనేశారట. అంతేకాదు ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతికి మరో భాషలో సినిమాలు చేసే టైం లేదని తెలుస్తుంది. అందుకే విజయ్ సేతుపతి టాలీవుడ్ వైపు రావట్లేదని అంటున్నారు. అయితే సరైన కథ పడితే విజయ్ సేతుపతి కూడా తన డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా అలాంటి కథ తెలుగు నుంచి రాలేదని తెలుస్తుంది.

విజయ్ సేతుపతికి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఇక్కడ సోలో సినిమా చేసినా సరే వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే తమిళంలో వరుస స్టార్ సినిమాలతో బిజీగా ఉన్న మక్కల్ సెల్వన్ తెలుగులో నటించడం అంటే అది ఎప్పటికి కుదురుతుందో చూడాలి. ఈమధ్య విలన్ గా తన మార్క్ చూపిస్తూ అలరిస్తున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.

Tags:    

Similar News