ఇప్పుడేమైనా అంటే ఆ హీరో తాట తీసేస్తాడు!
ఇలా అవమానాలు పడటం అన్నది షాహిద్ కి చిన్నప్పుడే అలవాటైంది. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో క్లాసు రూమ్ ల్లో కూర్చోనివ్వలేదుట.
నేడు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద ఒంటి చేత్తో వందల కోట్ల రూపాయల వసూళ్లు తేగల సామర్ధ్యం ఉన్న నటుడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటులే. చిన్నప్పుడు నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం బాలీవుడ్ కి ఓ అవు ట్ సైడర్ లాగే ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే పేరుకే నటులు తప్ప నటులుగా తల్లిదండ్రులు అంత ఫేమస్ కాదు.
ఆ రకంగా షాహిద్ బాలీవుడ్ లో ఆరంభంలో చాలా మంది నటుల్లాగే చాలా అవమానాలు భరించాడు. బ్యాక్ గ్రౌండ్ లేని వారిని ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేస్తుందో అలాగే షాహిద్ ని సైతం ట్రీట్ చేసింది. తాజాగా ఈ విషయాలు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసి తానెంత బలంగా ఎదిగాడు అన్నది గుర్తు చేసాడు. ఇలా అవమానాలు పడటం అన్నది షాహిద్ కి చిన్నప్పుడే అలవాటైంది. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో క్లాసు రూమ్ ల్లో కూర్చోనివ్వలేదుట.
భాష వేరుగా ఉండటంతో పరాయి వాడిలా...అంటరాని వాడిలా ట్రీట్ చేసారుట. అద్దె ఇంట్లో ఉంటూనూ నెలకో ఇల్లు మారాల్సి వచ్చేదిట. అలాగే ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చే వారిని హీనంగా చూస్తారని.. అవకాశాలివ్వరని అన్నాడు. చాలా ఏళ్ల పాటు శ్రమిస్తే తప్ప ఛాన్సు రాలేదన్నాడు. అలాంటి వారిపై తిరగబడాలని లోపల బలంగా ఉన్నా? సినిమా అనే ప్రపంచం తనని అలా చెయ్యనివ్వలేదన్నాడు.
అప్పుడు అంత ఆర్ధిక శక్తి కూడా తన దగ్గర లేదన్నాడు. ఇండస్ట్రీలో రాజకీయాల గురించి ఇప్పుడు బాగా అవగాహన వచ్చిందని..ఇప్పుడు ఎవరేమన్నా ఊరుకోవడం లేదని...మాటకు మాట..దెబ్బకు దెబ్బే సమాధానంగా పరిశ్రమలో కొనసాగుతున్నట్లు తెలిపాడు. ఎవరైనా వేధించే ప్రయత్నం చేసినా... తోటి వారిని ఏమైనా అన్నా ఊరుకోవడం లేదుట. ఇతరులను వేధించి అనందించే వాళ్లను తాను కూడా వేధిస్తానని అన్నాడు.