ఖాన్ ఇంటిని చుట్టుముట్టిన ఖాకీలు.. అస‌లేం జ‌రిగింది?

కింగ్ ఖాన్ షారూఖ్ ఇంటిని పోలీసులు మోహ‌రించారు. ఖాకీ బ‌ల‌గాలు పెద్ద ఎత్తున ఆయ‌న ఇంటి ప‌రిసరాల్లో క‌నిపించ‌డంతో హైటెన్ష‌న్ అలుముకుంది.

Update: 2023-08-27 08:11 GMT

కింగ్ ఖాన్ షారూఖ్ ఇంటిని పోలీసులు మోహ‌రించారు. ఖాకీ బ‌ల‌గాలు పెద్ద ఎత్తున ఆయ‌న ఇంటి ప‌రిసరాల్లో క‌నిపించ‌డంతో హైటెన్ష‌న్ అలుముకుంది. అస‌లింత‌కీ ఎందుకీ కాప్ హై డ్రామా? అస‌లేం జ‌రుగుతోంది? అంటూ ఆరాలు ప‌రేషాన్ చేస్తున్నాయి.

షారూఖ్ కి వ్యతిరేకంగా కొంద‌రు నిరసనలతో హోరెత్తించ‌డంతో షారుఖ్ ఖాన్ ఇల్లు `మ‌న్న‌త్` వెలుపల పటిష్టమైన పోలీసు రక్షణ ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింది. శనివారం మధ్యాహ్నం అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు మన్నత్ కు ముందు నిరసనలు తెలియ‌జేసారు. వీళ్లంతా ఎందుకీ దాడులు? అని అంటే.. దానికి కార‌ణం లేక‌పోలేదు.

నిరసనకారుల వాద‌న‌ ప్రకారం.. యువతను తప్పుదారి పట్టించే కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను SRK ప్ర‌మోట్ చేయ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలిపారు. జంగ్లీ- ర‌మ్మీ- జుప్పీ వంటి యాప్‌లను షారూఖ్‌ ఆమోదించ‌డ‌మే గాక వాటిని ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో ఒక‌టే అల‌జ‌డి మొద‌లైంది. అయితే విజ్ఞులైన కొంద‌రు ఇప్పుడే ఈ దాడుల వెన‌క‌ మ‌త‌ల‌బు ఉంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. నిజానికి నెలల తరబడి ఈ యాప్‌ల ప్రకటనలు హల్‌చల్‌ చేస్తున్నా కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ లేనిది.. జవాన్‌ విడుదలకు ముందే ఎందుకు? అన్న డౌట్లు పుట్టుకొచ్చాయి. ఇలా మ‌న్న‌త్ ముందు నిరసనలు వ్యక్తం చేయడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది.

అట్లీ దర్శకత్వం వహించిన `జ‌వాన్` చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ప్ర‌స్తుతం క‌థానాయ‌కుడు షారూఖ్‌ ఖాన్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ట్విట్టర్‌లో `ఆస్క్ SRK` సెషన్ లో అభిమానులు చాలా ప్ర‌శ్న‌లు సంధించ‌గా ఖాన్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చారు. ``ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే నా భార్యతో ఎలా వ్యవహరించాలి? అని ఒక అభిమాని ప్ర‌శ్నించ‌గా...దానికి షారూఖ్ ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు. ``సరే అబ్బాయిలు.. ఇకపై భార్య సమస్యకు పరిష్కారం కావాల‌నే ప్రశ్నలు అడ‌గొద్దు దయచేసి!! భార్యలతో క‌లిసి దయచేసి జ‌వాన్ సినిమా చూడండి.. అని ఖాన్ ట్వీట్ చేసారు. ``జవాన్` గురించి ఒక్క మాటలో వర్ణించమని ప్ర‌శ్నించ‌గా..పురుషుల‌ను న‌డిపించేది స్త్రీ. మ‌గ‌వారి కోణంలో మహిళలకు సంబంధించిన చిత్రమిది!! మాస్ - క్లాస్ అందరికీ నచ్చుతుంది..` అని షారూఖ్ అన్నారు.

ఒక పాట లేదా ట్రైలర్‌ను లాంచ్ చేయాలని కోర‌గా.. జ‌వాన్ లోని కొత్త పాట టీజర్‌ను SRK లాంచ్ చేశాడు. ``నో రామయ్యా వస్తావయ్యా..`` అనే పాట అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఖాన్ అన్నారు. జవాన్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా తదితరులు నటించారు. ఇందులో దీపికా పదుకొణె అతిధి పాత్రలో న‌టించింది.

Tags:    

Similar News