బిగ్ బాస్ హౌస్ నుండి ఆమె ఔట్.. అతను సేఫ్
ఈ వారం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే నామినేషన్స్ నుంచి ఈరోజు ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది.
బిగ్ బాస్ సీజన్ 7 రెండో వారం పూర్తి కానుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షోలో.. ఇప్పటికే హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. ఇప్పుడు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కు సిద్ధంగా ఉన్నారు. అయితే అది షకీలా అని తెలుస్తోంది.
ఈ వారం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే నామినేషన్స్ నుంచి ఈరోజు ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే పవర్ అస్త్ర సాయంతో శివాజీ సేఫ్ అయ్యారు. మిగిలిన 8 మందిలో ఆఖరి స్థానంలో షకీలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు ఓట్లు సరిగ్గా రాలేదని సమాచారం అందింది.
ఎందుకంటే హౌస్ లో షకీలా.. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ఇవ్వట్లేదని అంటున్నారు. ఆమె వివాదాలకు దూరంగా సేఫ్ గేమ్ ఆడుతూ.. హౌస్లో ఎవరైనా గొడవపడినా కూడా వాటిని సద్దుమనిగేలా చేస్తోంది. హౌస్ లో ఇలా సేఫ్ ఆడుతూ సైలెంట్ గా ఉంటే.. కుదరదు. టాస్కుల విషయంలో గట్టి పోటీ ఇవ్వాలి. కానీ అవి షకీలా వల్ల కావట్లేదని తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ కాబోతుందని సమాచారం అందింది.
ఇకపోతే ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయన్న వార్తలు కూడా వచ్చాయి. షకీలాతో పాటు శోభాశెట్టి పేరు కూడా వచ్చింది కానీ.. ఆ తర్వాత శోభా శెట్టిని సీక్రెట్ రూమ్ లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లు దక్కించుకొని మొదటి స్థానంలో ఉన్నట్లు సమాచారం.
అసలు ఈ వారం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో బిగ్ బాస్ ఫాలోవర్స్ కు తెలిసిన విషయమే. దీంతో పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అతడికే ఎక్కువ మద్దతు దక్కింది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్ లోకి రాబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మరి వారెవరో..