మిర్ర‌ర్ సెల్పీతో మ‌త్తెక్కించిన శామా!

పోటీని త‌ట్టుకుని నిల‌వాలంటే? ఆ మాత్రం త‌ప్ప‌దంటూ కాంపిటీష‌న్ మార్కెట్ లో ముందుకు సాగిపోతుంది.

Update: 2024-06-02 23:30 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ తెలిసిందే. ఎలాంటి డిజైన‌ర్ లో నైనా శామా సెగ‌లు పుట్టిం చాల్సిందే. ఎలివేష‌న్ లో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో కిక్కు ఏమాత్రం త‌గ్గ‌దు. డిజైన‌ర్ దుస్తులేసినా..చీర క‌ట్టినా షామా బ్యూటీకి తిరుగుండ‌దు. ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డం కాదు..ట్రెండ్ ని సెట్ చేసే టైపు. ఈ మ‌ధ్య కాలంలో శామా వేడి మ‌రింత రెట్టింపు చేసింది. పోటీని త‌ట్టుకుని నిల‌వాలంటే? ఆ మాత్రం త‌ప్ప‌దంటూ కాంపిటీష‌న్ మార్కెట్ లో ముందుకు సాగిపోతుంది.


సినిమా ఛాన్సులు త‌గ్గినా ఇంకా మీడియాలో ఫాంలో క‌నిపిస్తుందంటే? కార‌ణం ఈ ర‌క‌మైన ఎలివేష‌న్లు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అమ్మ‌డు ఓ మిర్ర‌ర్ సెల్పీతో ఇన్ స్టాలో కాక పుట్టిస్తుంది. ఇదిగో ఇక్క‌డిలా అద్దం ముందు కుర్చుని థై అందాల్ని హైలైట్ చేసింది. న‌లుపు డిజైన్ స్క‌ర్ట్ లో శామా థై అందాలు పీక్స్ లో హైలైట్ అవుతున్నాయి. అమ్మ‌డి మ్యాక‌ప్..ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ శామాని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి.


ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. శామా బ్యూటీకి నెటి జ‌నులుంతా ఫిదా అవుతున్నారు. బోల్డ్ లాక్ బేబి, లుకింగ్ గార్జియ‌స్ అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు ప‌డుతున్నాయి. ప్రపోజ‌ల్స్ పీక్స్ లోనే క‌నిపిస్తున్నాయి. ఇక షామా కెరీర్ సంగ‌తి చూస్తే `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది.

బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ అప్పీరియ‌న్స్ త‌ప్ప ఇంత వ‌ర‌కూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మ‌రి తాజా ప్ర‌య‌త్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడ‌తాయా? అన్న‌ది చూడాలి. ఈ బ్యూటీ ఇంత‌వ‌ర‌కూ టాలీవుడ్ లో మాత్రం చేయ‌లేదు.

Tags:    

Similar News