పిక్ టాక్ : సీనియర్ బ్యూటీ అందాల షో
1999 లో మాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్.
1999 లో మాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కక పోవడంతో యే మేరి లైఫ్ హై అనే టీవీ సిరీస్ తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపు తో సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది.
నటిగా, మోడల్ గా షామా సికిందర్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో నెట్టింట రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. 42 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ కన్నుల విందు చేస్తుంది.
తాజాగా మరోసారి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇలా అందాల షో చేసింది. ఈ సీనియర్ నటి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోల్లో షామా సికిందర్ అందం చూసి ఫిల్మ్ మేకర్స్ నుంచి పిలుపు వస్తుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న షామా సికిందర్ వెబ్ సిరీస్ లు మరియు మ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ వయసులో కూడా ఇంత అందం ఏంట్రా బాబు అంటూ జనాలు ఫిదా అవుతున్నారు.